జాతీయ వార్తలు

జకార్తా తీరంలో ఐసీజీఎస్ శౌర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: భారత తీర రక్షణ దళానికి చెందిన ఆఫ్ షోర్ పెట్రోలింగ్ ఐసీజీఎస్ శౌర్య గస్తీ నౌక మూడు దేశాల సందర్శనకు బయలుదేరింది. గుడ్ విల్ విజిట్‌లో భాగంగా జకార్తా(ఇండోనేషియా), డ్రావిన్(ఆస్ట్రేలియా), సింగపూర్ దేశాల్లో తీర గస్తీ నౌక ఈ నెల 12న జకార్తాకు పయనమై వచ్చే నెల 8 వరకూ ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాల్లో వివిధ కార్యకలాపాల్లో పాలుపంచుకోనుంది. ఈ సందర్శనలో భాగంగా ఈ నెల 17 నుంచి 20 వరకూ జకార్తాలోనే ఉంటుంది. సందర్శనలో భాగంగా మారీటైం లా అమలు అంశంలో ఇరు దేశాల మధ్య సమన్వయం, సహకారంపై ఇరు దేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతారు. సముద్రంలో గాలింపు, పునరావాసం, మారీటైం కాలుష్యం, సముద్రంలో జరిగే చోరీలు తదితర విషయాల్లో పరస్పర సహకారం వంటి అంశాలు చర్చిస్తారు. సందర్శనలో భాగంగా ఇరు దేశాల తీర రక్షణ దళాలు వివిధ అంశాలలో పరస్పర సహకారంపై చర్చిస్తారు. ఈ సందర్శనలో పాల్గొన్న ఐసీజీఎస్ శౌర్యకు కోస్ట్‌గార్డ్ డీఐజీ జ్యోతిందర్ సింగ్ సారధ్యం వహించగా 17 మంది ఆఫీసర్లు, 116 మంది నావికులు పాల్గొన్నారు.

*చిత్రం...జకార్తా తీరంలో ఐసీజీఎస్ గస్తీ నౌక శౌర్య