జాతీయ వార్తలు

అమెరికాలో విద్యకు పెరుగుతున్న క్రేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో విద్యనభ్యసించే వారిలో భారతీయుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన వారి సంఖ్య రెండు లక్షలకు పైగానే ఉంది. అంతర్జాతీయంగా చూస్తే ఈ విద్యా సంవత్సరంలో అక్కడికి వెళ్లిన వారి సంఖ్య మూడు శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించిన వారిలో కేవలం భారతీయుల సంఖ్య 18 శాతం ఉందంటే అక్కడి విద్యకు ఉన్న క్రేజ్ ఏపాటితో చెప్పకనే చెబుతోంది. 2019 ఓపెన్ డోర్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్సేంజ్ లెక్కల ప్రకారం వివిధ దేశాల నుంచి ఈ ఒక్క విద్యా సంవత్సరమే పది లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్య కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) ఆధ్వర్యంలో ఈ సంస్థ గణాంకాలను తెలియజేసింది. భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే దిశగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోందని అమెరికా రాయబార మంత్రిత్వ వాఖ కౌనె్సలర్ చారీస్ పిలిప్స్ ఢిల్లీలో సోమవారం తెలియజేశారు. ‘గుణాత్మక విద్యతో పాటు తమ పెట్టుబడికి అనుగుణంగా రాబడిని అమెరికా అందించగలదన్న ప్రగాఢ విశ్వాసంతోనే తమ దేశానికి విచ్చేస్తున్నారని’ ఆయన స్పష్టం చేశారు. 2018లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల ద్వారా 44.7 బిలియన్ డాలర్లు తమకు సమకూరుతున్నాయని ఆయన వెల్లడించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 5.5 శాతం అదనంగా వచ్చిందని వివరించారు. కాగా, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికాలో విద్యనభ్యసించేందుకు చైనా నుంచి మూడు లక్షల 69వేల 548 మంది వెళ్లగా.. భారత్ నుంచి రెండు లక్షల రెండు వేల 14మంది వెళ్లారు. అంటే విద్య కోసం అమెరికాకు వెళ్లిన వారి సంఖ్యతో పోలిస్తే చైనా మొదటి స్థానంలోనూ.. భారత్ రెండో స్థానంలోనూ ఉన్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది.