జాతీయ వార్తలు

పౌరసత్వ బిల్లు మరో ఎన్‌ఆర్‌సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచ్‌బెహర్ (పశ్చిమ బెంగాల్), నవంబర్ 18: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు-2019ను తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇది నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటీజన్స్ (ఎన్‌ఆర్‌సీ) వంటిదేనని ఆమె తెలిపారు. సోమవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల్లోనే వివాదస్పద పౌరసత్వ సవరణ బిల్లు-2019 (క్యాబ్)ను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె విమర్శించారు. బెంగాలీలను, హిందువుల్లోని కొన్ని మతాలను వేరు చేసేందుకే ఈ ఎత్తుగడ అని ఆమె విమర్శించారు. లోగడ జనవరి 8న లోక్‌సభలో ఈ బిల్లును ఆమోదించినా, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపాదించ లేదన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్లీ ‘క్యాబ్’ను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని ఆమె చెప్పారు. అస్సాంలో నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ పేరిట 19.6 లక్షల మంది పేర్లను ఎన్‌ఆర్‌సీ జాబితా నుంచి తొలగించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆమె విమర్శించారు. ఏయిర్ ఇండియా వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి ఉందని ఆమె విమర్శించారు. ఏయిర్ ఇండియా వంటి సంస్థలను ఆదుకునేందుకు కేంద్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆమె ప్రశ్నించారు.

*చిత్రం... తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ