జాతీయ వార్తలు

ఆరోగ్య సిద్ధితోనే సుస్థిర అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అందరికీ ఆరోగ్య సేవలను విశ్వజనీన రీతిలో అందుబాటులోకి తేవడం ద్వారానే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించగలుగుతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ స్పష్టం చేశారు. వైద్య ఉత్పత్తులతోపాటు న్యాయ, వాణిజ్యపరమైన అంశాలను కూడా సానుకూలంగా మార్చాల్సిన అవసరం ఉందని మంగళవారంనాడు ఇక్కడ ఓ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన అన్నారు. దేశ పౌరులకు అత్యంత ప్రామాణికమైన రీతిలో వైద్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఒనగూర్చుకోవాలంటే విశ్వజనీన ఆరోగ్య విస్తరణ అత్యంత కీలకమని, అందుకు భారత్ నిబద్ధతాయుతంగా కట్టుబడి ఉందని తెలిపారు. 2018లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలను ఏమేరకు సాధించామన్న దానిపై సమీక్షించుకునేందుకే ఈ తాజా ప్రపంచ సదస్సు జరుగుతోంది. పటుతరమైన వైద్య సేవా విధానాన్ని అమలు చేయడం, సరైన, అందరికీ అందుబాటులో వచ్చే రీతిలో వైద్య సేవలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ ప్రయత్నాల లక్ష్యమని ఆయన తెలిపారు. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. పరస్పరం విలువైన సమాచారాన్ని పంచుకోవడానికి, అనుభవాలపై చర్చించుకోవడానికి, వైద్య సేవలను, ఉత్పత్తులను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపకరిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే, వైద్యపరమైన అంశాలను సమగ్ర దృష్టితో పరిశీలించడానికి, లోపరహితమైన రీతిలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కూడా ఈ సదస్సు ఓ బలమైన వేదిక అవుతుందని అన్నారు. వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు నాణ్యతాయుతమైన మందులను కూడా ప్రజలకు చౌకగా లభించేలా చూడడం సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కీలకమని అన్నారు. వైద్యపరంగా అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీలు, కొత్త ఆలోచనలు, ప్రోది చేసుకున్న విజ్ఞానం, హెల్త్‌కేర్ వ్యవస్థను పటిష్టం చేయడానికి బలమైన పునాదులు అవుతాయని హర్షవర్దన్ తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ బలమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందించుకోవాలని, ఇందుకోసం పరస్పరం వనరులను, ఆలోచనలను పంచుకోవాలని ఆయన తెలిపారు. 2020 ప్రపంచ సదస్సు సెప్టెంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుందని, అనంతరం అంతర్జాతీయ ఔషధ నియంత్రణ అథారిటీ సమావేశం జరుగుతుందని తెలిపారు. మొదటిసారిగా భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి జాహిద్ మొలేక్, భూటాన్ ఆరోగ్య మంత్రి డిషన్ వాంగ్మో, నేపాల్ ఉప ప్రధాని, ఆరోగ్య మంత్రి ఉపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానోమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చౌకగా నాణ్యతాయుతమైన రీతిలో వైద్య సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబద్ధతతో కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఇటీవల కాలంలో ఇతర వ్యాధులు కూడా తీవ్రమైన దృష్ట్యా దీర్ఘకాల చికిత్స అవసరాలు పెరిగాయని, దాని ఫలితంగా ఆరోగ్య ఖర్చులు తీవ్రమయ్యాయని అన్నారు. అలాగే, జనాభాలో వయసు మీరినవారి సంఖ్య పెరిగిపోవడం వల్ల మరింతగా వైద్య సేవలను విస్తృపరచాల్సిన అవసరం ఉందని అన్నారు.

*చిత్రం... కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్