జాతీయ వార్తలు

పాఠశాలల అభివృద్ధికి మ్యాచింగ్ గ్రాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పాథమిక, మాధ్యమిక పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తోందని, దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రానికి వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల నిర్మాణం, పెయింటింగ్ తదితర పనులకు ఉపాధి హామీని అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని 90 సంస్థల ఆస్తులు, అప్పులపై షీలాబేడీ కమిటీ సిఫార్సుల అమలుకు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలే తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇలా సమాధానమిచ్చారు.
గిరిజన వర్సిటీని తాళ్లూరుకు మార్చండి
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరం జిల్లా తాళ్లూరుకు మార్చాలని వైసీపీ లోక్‌సభ సభ్యురాలు గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో మాధవి మాట్లాడుతూ వర్సిటీని గతంలో షెడ్యూలేతర ప్రాంతమైన రెల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారని, తాజాగా షెడ్యూల్ ప్రాంతంలో ఏర్పాటుకు తాళ్లూరులో 250 ఎకరాలను గుర్తించినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.
బోయ రెజిమెంట్ ఏర్పాటు చేయండి
బోయ, వాల్మీకి పేరుతో ప్రత్యేకమైన రెజిమెంట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైసీపీ లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు. ఏపీలో బీసీలుగా వున్న బోయ, వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించాలని లోక్‌సభలో జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అలాగే కేంద్ర హోంశాఖ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యులుగా గోరంట్ల మాధవ్ నియమితులయ్యారు.