జాతీయ వార్తలు

పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే వుందని కేంద్రం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రఫైనరీ, పెట్రో కెమికల్ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల పారిశ్రామికీకరణతోపాటు ఆదాయం, ఉపాధి, పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ తరహా ప్రాజెక్టులకు భారీమొత్తంలో నిధులు అవసరమని.. కాకినాడలో రూ.32,091కోట్లతో ప్రెటో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, గెయిల్, హెచ్‌పీసీఎల్ 2017లో ఒప్పందం చేసుకున్నాయని, వయబిలిటి గ్యాప్ ఫండ్ అవసరమని చమురు సంస్థలు ఏపీకి సూచించాయి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.