జాతీయ వార్తలు

ఎన్‌ఆర్‌సీలో వివక్ష ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశవ్యాప్తంగా అమలు చేయబోయే పౌరసత్వ జాబితా (ఎన్‌ఆర్‌సీ)లో ఎలాంటి వివక్ష చూపబోమని, అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బుధవారం ఆయన రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని, అయితే, అందులో కుల, మత తేడా లేవీ ఉండవని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో తమపై జరుగుతున్న హింస, అమానుషకాండను తట్టుకోలేక వివిధ దేశాల్లో శరణార్థులుగా ఉంటున్న హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్శీలకు కూడా భారత పౌరసత్వం లభించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఎన్‌ఆర్‌సీని దేశం మొత్తం వర్తింపజేయడం వల్ల ఏ ఒక్క మతమూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దేశ పౌరులందర్నీ ఎన్‌ఆర్‌సీ కిందకు చేర్చడమే తమ లక్ష్యమని, ఇందులో మతాల ప్రసక్తే ఉండదని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని మతాలకు చెందిన పౌరులకు ఎన్‌ఆర్‌సీలో చోటు ఉంటుందని అన్నారు. మతపరంగా ఎలాంటి వివక్ష ఉండబోదని తెలిపారు. ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధం లేదని, ఈ రెండు వేర్వేరు అంశాలని అమిత్ షా ప్రకటించారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ విధానం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు లోబడే జరిగిందని ఆయన గుర్తు చేశారు. దీనిని మరింతగా మెరుగుపరచి, దేశవ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. మతాల వారీగా దేశాన్ని విభజించడానికే ఎన్‌ఆర్‌సీని బీజేపీ అమలు చేస్తుందని వచ్చిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ఏ మతానికి చెందినవారూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇలావుండగా, తమ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని ఎట్టి
పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఒక మతానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆమె ఒక ప్రకటనలో ఆరోపించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్‌ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేయరాదని నిబంధన ఉందని అన్నారు. బెంగాల్‌లో అరాచక పరిస్థితులను సృష్టించడానికి కేంద్ర ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనీయబోమని చెప్పారు. అస్సాంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సీ జాబితాలో 14 లక్షల మంది హిందువులు, బెంగాలీల పేర్లు ఎందుకు లేవని ఆమె ప్రశ్నించారు. మతాల వారీగా దేశాన్ని విభజించడాన్ని తాము అంగీకరించబోమని మమత చెప్పారు.

*చిత్రం... రాజ్యసభలో బుధవారం మాట్లాడుతున్న అమిత్ షా