జాతీయ వార్తలు

అది అధికారికం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ బృందం వ్యక్తిగత హోదాలోనే ఇక్కడకు వచ్చిందని కేంద్రం స్పష్టం చేసింది. ఇది అధికారిక పర్యటన కాదని ప్రకటించింది. 27 మంది సభ్యులు గల ఈయూ బృందం అక్టోబర్ 28 నుంచి ఈనెల 1వ తేదీ వరకు ఐదు రోజులపాటు జమ్మూకాశ్మీర్‌లో పర్యటించింది. ఢిల్లీకి చెందిన ఓ అధ్యయన కేంద్రం ఆహ్వానం మేరకు ఈ బృందం జమ్మూకాశ్మీర్ పర్యటనకు వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ఒక లిఖితపూర్వక సమాధానంగా సభకు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని ఆయన అన్నారు. అక్కడ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని మన దేశానికి చెందిన ఎంపీల బృందాన్ని పర్యటించేందుకు అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో భయానక పరిస్థితి నెలకొందని, శాంతి భద్రతలను దారుణంగా క్షీణించాయని, ప్రజలు ఆంక్షల మధ్య అల్లాడుతున్నారని కొంతమంది చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అంశాల వారీగా ఆంక్షలు అమలు జరుగుతున్నాయని, అది కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని వివరించారు. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి క్రమంగా సాధారణ పరిస్థితి నెలకొంటోందని ఆయన అన్నారు.