జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ది నాన్చుడు విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానికా/లోహార్డాగా (జార్ఖండ్), నవంబర్ 21: దేశాన్ని పట్టిపీడించిన ఎన్నో సమస్యల పట్ల కాంగ్రెస్ నాన్చుడు ధోరణినే అనుసరించిందని, దశాబ్దాల పాటు అవి పరిష్కారానికి నోచుకోకుండా ఉండడానికి ఆ పార్టీ అనుసరించిన విధానమే ప్రధాన కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మానికా, లోహార్డాగాలో జరిగిన ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఓటు బ్యాంక్ రాజకీయం చేసి, కాశ్మీర్, రామజన్మభూమి వంటి సమస్యలను తాత్కారం చేసిందని ఆరోపించారు. ఎంతోకాలంగా అయోధ్యలో రామ మందిరాన్ని దేశ ప్రజలు కోరుతున్నారని, కానీ, ఒక వర్గం నుంచి సానుకూల స్పందన కోసం పాకులాడిన కాంగ్రెస్ ఆ సమస్యను సాగదీస్తూ వచ్చిందని అమిత్ షా ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునివ్వడంతో, ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని అన్నారు. అయితే, ఇప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుకాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తునే ఉందని అన్నారు. అదే విధంగా కాశ్మీర్ సమస్య సుమారు 70 సంవత్సరాలు రావణకాష్టంగా రగులుతునే ఉండడానికి కాంగ్రెస్ అనుసరించిన విధానాలే కారణమని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ చొరవ తీసుకొని, రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణలను రద్దు చేయడంతో సమస్యకు తెరపడిందన్నారు. రామజన్మభూమి వివాదం మాదిరిగానే కాశ్మీర్ సమస్యను కూడా కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకు ఉపయోగించుకుందని అమిత్ షా మండిపడ్డారు. జార్ఖండ్ రాష్ట్భ్రావృద్ధికి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ పార్టీలు చేసింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. గిరిజనులకు కాంగ్రెస్, జేఎంఎం ఏమాత్రం న్యాయం చేయలేదన్నారు. బీజేపీ సర్కారు మాదిరిగా గిరిజనులకు విద్యుత్, వంట గ్యాస్ కనెక్షన్, హెల్త్ కార్డులు, మరుగుదొడ్లు, ఇళ్లు వంటి సౌకర్యాలను కాంగ్రెస్, జేఎంఎం ఎందుకు కల్పించలేకపోయాయని నిలదీశారు. సమస్యలను నానుస్తూ, స్వలాభం చూసుకునే కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలో లేక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రఘువర్ దాస్ ప్రభుత్వానికి మద్దతునివ్వాలో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ తేల్చుకోవాలని అన్నారు. జార్ఖండ్‌లో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రఘువర్ దాస్ సర్కారు తన అభివృద్ధికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తుందని? తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామన్నది కాంగ్రెస్, జేఎంఎం చెప్పగలవా అని సవాలు విసిరారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

*చిత్రం... జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం లోహర్‌దాగాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.