జాతీయ వార్తలు

ఆర్థిక పరిస్థితిపై నిపుణులతో చర్చించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్), నవంబర్ 21: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్య పరిస్థితులపై నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు. అదే విధంగా అన్ని పార్టీలతోనూ సమావేశమై, అభిప్రాయాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ)లోని వాటాలను కేంద్రం ఉపసంహరించుకోవడాన్ని ఆమె గురువారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ప్రస్తావించారు. భారత్ పెట్రోలియంసహా ఐదు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం చేసిన ప్రకటనపై స్పందిస్తూ, ఇప్పటికే చాలా వరకూ పీఎస్‌యూలను కేంద్రం అమ్మేసిందని విమర్శించారు. పెట్టుబడుల ఉపంసహరణలపై కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆమె ధ్వజమెత్తారు. దేశంలోని ఆర్థిక రంగ నిపుణులతో ప్రధాని చర్చించాల్సిన అవసరం ఉందని, అదే విధంగా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక పరిస్థితిని చర్చించాలని హితపు పలికారు. దేశంలో వృద్ధిరేటు మందగించిందని, మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోకుండా, పీఎస్‌యూ సంస్థల్లో వాటాలను విక్రయించడం దారుణమని అన్నారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్రం ఎవరిని సంప్రదించిందని, ఎవరి అభిప్రాయాలు, సూచనలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. దేశ భవిష్యత్తుకు చెందిన అంశాలపై విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు. నిపుణలతో చర్చించాలని కోరారు. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించాలని అన్నారు.

*చిత్రం... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ