జాతీయ వార్తలు

రివ్యూ పిటిషన్‌పై 24న నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 21: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలా? వద్దా? అనే అంశంపై ఈనెల 24న జరగనున్న సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలా? వద్దా అనే అంశంపై నిర్ణయాధికారం తనకు ఉన్నప్పటికీ.. సభ్యులు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 24న జరిగే సమావేశంలో స్పష్టంగా చెప్పవచ్చని ఫరూఖీ గురువారం ఇక్కడ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే స్థలాన్ని అంగీకరించాలా? వద్దా? అనే అంశంపై సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆ రోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఎలాంటి తీర్పునైనా సమర్థిస్తామని గతంలో ఫరూఖీ చెప్పిన సంగతి తెలిసిందే. బోర్డులో కొంతమంది సభ్యులు కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మీడియలో వస్తున్న కథనాలపై ఫరూఖీ స్పందించారు. రివ్యూ పిటిషన్‌పై వేసే అంశంపై నిర్ణయాధికారం తనకు ఉన్నప్పటికీ 24న జరిగే సమావేశంలో మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. రివ్యూ పిటిషన్ వేయాలన్న అంశంపై ఎవరైనా సరే అభ్యంతరం ఉంటే స్వచ్ఛందంగా చెప్పవచ్చని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ఇచ్చే ఐదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించే అంశాన్ని అంగీకరించేది లేదన్న ముస్లిం పర్సనల్ లాబోర్డు తీసుకొన్న నిర్ణయానికి అఖిల భారత షియా పర్సనల్ లాబోర్డు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు షియా బోర్డుతో కలిసే ఉందనీ.. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఎవరికి ఎలాంటి అనుమానం లేదా ఫిర్యాదులుంటే న్యాయపరంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అధికారం తమకు ఉందని ముస్లిం పర్సనల్ లా బోర్డు అధికార ప్రతినిధి అబ్బాస్ స్పష్టం చేశారు.