జాతీయ వార్తలు

‘అమరావతి’ లేకుండా భారతదేశ పటమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుర్తించకుండా కేంద్ర హోంశాఖ భారత చిత్రపటం విడుదల చేయడంపై లోక్‌సభలో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ఆక్షేపణ తెలిపారు. లోక్‌సభ జీరోఅవర్‌లోగురువారం ఈ అంశాన్ని గల్లా ప్రస్తావించారు. భారత చిత్రపటంలో ఏపీ నూతన రాజధాని లేకపోవడం అంటే అది రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. కేంద్ర హోంశాఖ ఈ తప్పును తక్షణమే సరిదిద్దాలన్నారు. ఇది ఒక విధంగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానిని కూడా అవమానించడమేనని జయదేవ్ అన్నారు. అలాగే అమరావతికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం నూతన చిత్రపటం విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని గల్లా సూచించారు.
2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సేవల్లేవు
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమలలో దాదాపు 2,068 గ్రామాలకు మొబైల్ ఫోన్ సర్వీసులు అందుబాటులో లేవని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి రవి శంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖీతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో తూర్పు కనుమల విస్తరించి వున్న తొమ్మిది జిల్లాల్లో ఈ గ్రామాలున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మారుముల ప్రాంతాల్లో, అనువుగాని భౌగోళిక ప్రాంతంలో అక్కడక్కడా విసిరేసినట్లు ఉండి వాణిజ్య పరమైన కార్యకలాపాలు ఏమాత్రం లేవని చెప్పారు. మొబైల్ ఫోన్ సర్వీసులు ఆయా గ్రామాలకు విస్తరించలేక పోయినట్లు మంత్రి వెల్లడించారు.