జాతీయ వార్తలు

అహింసా మార్గంలో నడవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: భారత్‌లో పురాతన కాలం నుంచి పాటిస్తున్న అహింస, కరుణ, దయ, ప్రేమ ప్రపంచానికి మార్గదర్శకాలని టిబెట్ ఆధ్యాత్నిక గురువుదలైలామా స్పష్టం చేశారు. అనేక దేశాల్లో మతం పేరుతోనో, ప్రాదేశిక అంశాలపైనో ప్రజలు ఘర్షణ పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదాలన్నింటికీ విరుగుడు అహింస, ప్రేమ అని దలైలామా పేర్కొన్నారు. విద్యా పరంగా దేశంలో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘అహింస, ప్రేమ, దయ, కరుణ వంటి అంశాలను పాఠ్యాంశాలుగా తీసుకురావాలి. మత పరమైన అంశాల స్థానే వాటిని ప్రవేశపెట్టాలి’అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 24వ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ‘సార్వత్రిక విలువలు’ అన్న అంశంపై 84 ఏళ్ల దలైలామా మాట్లాడుతూ ప్రంచంలో తలెత్తిన అనేక సమస్యలను అహింసా సిద్ధాంతాలతోనే పరిష్కరించుకోవాలని అన్నారు. ‘అనేక దేశాల్లో షియా, సున్నీలు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. భారత్‌లో అలాంటి సంఘటనలు లేవు’అని ఆయన స్పష్టం చేశారు. దానికి ప్రధాన కారణం...్భరత్ నైతిక విలువలకు పెట్టని కోటని, ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఆయన శ్లాఘించారు. ప్రపంచానికే భారత్ మార్గదర్శకంగా ఆయన చెప్పారు. విద్యారంగంలో సంస్కరణలు, ఆధునిక విద్యకు రాధాకృష్ణన్ ఎనలేని కృషి చేశారని, ఆయన పాత్ర ఎంతో గొప్పదని దలైలామా చెప్పారు. ఆధునిక విద్యకు, ప్రాచీన వేద విజ్ఞానానికి, సంస్కృతి, సంప్రదాయాల మేలుకలయికే సర్వేపల్లి అని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వారు అడిగిన ప్రశ్నలకు దలైలామా సమాధానాలు ఇచ్చారు. ‘మీరు ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా ఉంటారు. దీని వెనక కారణమేమిటి?’ అన్న ప్రశ్నకు ‘శతృవుని కూడా ప్రేమించడం, గురువుగా భావించడం వల్లే’అని బదులిచ్చారు. తనపై చైనా ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా తాను అలా చూడనని ఆయన అన్నారు. టిబెట్ వాసిగా చిన్నతనం నుంచి తాను నేర్చుకున్న బుద్ధిజం వల్లే ఇది సాధ్యమవుతోందని తెలిపారు. ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా కనిపించేందుకు తన వద్ద ‘ప్రత్యేక మాత్రలు’ ఉన్నాయని ఆయన చలోక్తి విసిరారు. భారతీయ శాకాహారంపై అడిగిన మరో ప్రశ్నకు ‘చైనా మాంసాహారం’ కంటే ఎంతో గొప్పది అని 1989 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వ్యాఖ్యానించారు. బాహ్య సౌందర్యం కంటే అంతర్గత విలువ ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పోరాడాలని ప్లాస్టిక్ వాడకంపై మాట్లాడుతూ అన్నారు. సంచలన వార్తల కంటే అక్షరాస్యత కోసం మీడియా కృషి చేయాలన్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా, ఐసీసీఆర్ అధ్యక్షుడు వినయ్ సహస్రాబుద్ధే తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఢిల్లీలో గురువారం 24వ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ లెక్చర్‌లో మాట్లాడుతున్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా