జాతీయ వార్తలు

ముంబైలో కూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, అక్టోబర్ 13: ముంబైలో గురువారం దారుణం చోటుచేసుకుంది. అయిదంతస్థుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు మైనర్లు మరణించారు. బాంద్రా సబర్బన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. మరో అయిదుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. అయేషా అక్బర్‌ఖాన్ (12), అలీ నిసార్ అహ్మద్‌ఖాన్ (16), ఒసామా నిసార్‌ఖాన్(14), అఫీఫా సదాబ్(1), రసూదా నిసార్ అహ్మద్‌ఖాన్(16), అరిబినిసార్‌ఖాన్(2)లు మరణించినట్లు ఫైర్‌బ్రిగేడ్ అధికారులు తెలిపారు. గాయపడిన అయిదుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నియంత్రణ కార్యాలయ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. అనంత్ కనేకర్ మార్గ్‌లోని జాతీయ పాఠశాల వద్ద ఈ అక్రమ కట్టడం ఉందని, దీని నిర్మాణం కూడా నాణ్యత లేకుండా ఉందని అధికారులు తెలిపారు. భవనం శిథిలాల నుంచి 11మందిని ప్రాణాలతో బయటకు తీసామన్నారు. మరికొందరు శిథిలాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని అధికారులు వెల్లడించారు.

చిత్రం.. ముంబైలో మంగళవారం కూలిన ఐదు అంతస్తుల భవనం