జాతీయ వార్తలు

రాజీనామా చేసి పార్టీ మారితే..తప్పుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22:పార్లమెంట్‌కు చెందిన ఓ సభ్యుడు రాజీనామా చేసి మరోపార్టీలో చేరడం తప్పేమీ లేదని,ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇందుకు అవకాశం ఉంటుందని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్పష్టం చేశారు. ఒక ఎంపీ పార్టీ మారడంలో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీ లేదని అన్నారు. పెద్దల సభలో బలవంతపు వలసలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు జయరామ్ రమేష్ ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో వెంకయ్య నాయుడి వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది. జయరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలను లోతుగా పరిశీలించాలని బీజేపీ సభ్యుడు నీరజ్ శంకర్ కోరారు. ఇటీవలే ఆయన సమాజ్‌వాది పార్టీ నుంచి బీజేపీలో చేరి విషయం తెలిసిందే. భారత రాజకీయ వ్యవస్థలో రాజ్యసభ పాత్ర అన్న అంశంపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొన్న జైరామ్ రమేష్ పెద్దల సభలో బలవంతపు వలసలు జరుగుతున్నాయని ఎవరి పేరునూ ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. జైరామ్ రమేష్ వ్యాఖ్యలకు నీరజ్ శంకర్ అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో మాట్లాడిన వెంకయ్య నాయుడు ‘పార్టీ మార్పిడికి సంబంధించినంత వరకూ వ్యక్తిగతంగా ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు. దీన్ని సరైన స్ఫూర్తితోనే పరిశీలించాలి. ఓ ఎంపీ రాజీనామా చేసి మరోపార్టీలో చేరడం అన్నది హుందాతోకూడిన సరైన చర్యే’నని అన్నారు. భవిష్యత్‌లో ఎవరు తామున్న పార్టీకి రాజీనామా చేసి మరోపార్టీలో చేరినా తాను అభినందిస్తానని కూడా అన్నారు. కాగా జయరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలను తాను రికార్డుల్లో పరిశీలించానని, అందులో తప్పేమీ లేదని కేవలం రాజకీయ వ్యాఖ్యేనని తెలిపారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి చట్టబద్ధంగా రాజీనామా చేసి మరో పార్టీ తరపున ఎన్నికయితే ఎవరి విషయంలోనూ అభ్యంతరం చెప్పాల్సిందేమీ లేదని వెంకయ్య నాయుడు తెలిపారు. అందుకే సభ్యులు అనుమానాలు కలిగించే రీతిలో రాజీనామాలు చేయకుండా హుందాగానే ఎన్నికై మరోపార్టీలోకి రావాలన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇందుకు ఎన్నో దృష్టాంతాలున్నాయని గుర్తు చేశారు. తాను రాజ్యసభ చైర్మన్ కాకముందు ఒక పార్టీకి రాజీనామా చేసి 16మంది సభ్యులు మరోపార్టీలో చేరారన్నారు.