జాతీయ వార్తలు

పాఠశాలలో పాము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయనాడ్ (కేరళ), నవంబర్ 21: కన్నబిడ్డల్లా చూసుకోవల్సిన ఉపాధ్యాయులే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. తరగతి గదిలోకి పాము ప్రవేశించడం ఒక ఎత్తయితే... దానిని కనీసం గమనించకపోగా.. అది ఓ విద్యార్థినిని కాటు వేసినా పట్టనట్టు వ్యవహరించడాన్ని చూస్తుంటే వారికి పిల్లల పాలిట ఏమాత్రం శ్రద్ధ కనబరుస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతరే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఒకేషనల్ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ పాము ఎలా చేరిందో తెలియదు.. ఐదో తరగతి గదిలోకి వచ్చేసింది. తరగతి నడుస్తున్న సమయంలో ఇది గదిలోకి ప్రవేశించి విద్యార్థిని షెహలా షెరిన్‌ను కాటు వేసింది. కాటు వేసిన వెంటనే బాలిక అరుపులు అరిచింది. కాటు వేసిన ప్రాంతం నీలి రంగులోకి మారిపోయింది. పాము కరిచి గంట గడిచినా సదరు టీచర్ ఎలాంటి చర్య తీసుకోకపోగా.. తండ్రి వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారని మొండికేశారు. అనంతరం తండ్రి వచ్చి నాలుగు ఆసుపత్రులకు ఎక్కడకు తీసుకెళ్లినా అక్కడ పాముకాటు మందు లభ్యత అందుబాటులో లేదు. దీంతో 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొజికోడ్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్లకుండానే బాలిక మృతి చెందింది.