జాతీయ వార్తలు

యూజీసీ, ఏఐసీటీఈ విలీనంపై తుది నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలిలను విలీనం చేసే అంశంపై తుది నిర్ణయం ఏదీ ఇంతవరకు తీసుకోలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సభ్యులు ఇచ్చిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘ఇప్పటి వరకు విలీనం అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని వివరించారు. గత సంవత్సరం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 1951 నాటి యూజీసీ చట్టాన్ని రద్దు చేసి యూజీసీలో మార్పులు తేనున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా హెచ్‌ఆర్‌డీ నిర్ణయించింది. అయితే, అనంతరం తీసుకొన్న నిర్ణయాల మేరకు సాంకేతిక విద్యా మండలిని స్వాధీనం చేసుకోవాలని భారత ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయం తీసుకొంది. కాగా, బిల్లుకు తుది రూపాన్ని తీసుకొచ్చి అక్టోబర్‌లో వెల్లడిస్తామని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన సమావేశంలో హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘యూజీసీ, ఏఐసీటీఈలను విలీనం చేస్తూ ఉన్నత విద్యా కమిషన్‌గా ఏకతాటిపైకి తీసుకురావాలని భావించాం.. బిల్లుపై అన్ని రాష్ట్రాలతో కూలంకషంగా చర్చలు జరిపి బిల్లును రూపొందించాలని అనుకొంటున్నాం.. దీనిపై అక్టోబర్‌లో నిర్ణయం తీసుకొంటాం’ అని సెప్టెంబర్‌లో మంత్రి పోక్రియాల్ ట్వీట్ చేశారు.