జాతీయ వార్తలు

రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: వివిధ మతాలకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు (పర్సనల్ లా) రాజ్యాంగానికి లోబడి ఉండాలనేది, లింగ సమానత్వం సూత్రానికి, గౌరవప్రదంగా జీవించే హక్కుకు అనుగుణంగా ఉండాలనేది ప్రభుత్వ స్పష్టమైన దృక్పథమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ‘ట్రిపుల్ తలాక్’పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో జైట్లీ ఆదివారం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో ‘ట్రిపుల్ తలాక్- ప్రభుత్వ అఫిడవిట్’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన సందేశంలో ఈ విషయం చెప్పారు. మత చట్టాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు లోబడి ఉండాలనే స్పష్టమైన వైఖరిని ప్రదర్శించడానికి గతంలోని ప్రభుత్వాలు సంకోచించాయని, భయపడ్డాయని, అయితే నేటి ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని తీసుకుందని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రమాణాలపై ట్రిపుల్ తలాక్ అంశాన్ని విచారించవలసి ఉంటుందని, ఇతర మతాల చట్టాలకు కూడా ఇదే ప్రమాణం వర్తిస్తుందని విడిగా చెప్పవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు ఉన్నది ట్రిపుల్ తలాక్‌కు రాజ్యాంగ బద్ధత అనే అంశం మాత్రమేనని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బహుభార్యత్వం, ట్రిపుల్ తలాక్ ఆచారాలను విడనాడాలని, వీటిని పాటించటం మతానికి తప్పనిసరి కాజాలదని, ఇవి మతంలో అంతర్భాగం కూడా కాజాలవని వాదించింది. ‘ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన చర్చను లా కమిషన్ ముందు కొనసాగించవచ్చు. ప్రతి మతం తనకంటూ ఒక ప్రత్యేక చట్టాన్ని కలిగి ఉంది. అయితే ఈ ప్రత్యేక మత చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండకూడదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి’ అని జైట్లీ పేర్కొన్నారు. మత చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండవలసిన అవసరం లేదని కొంతమంది పేర్కొంటున్నారని, అయితే అవి రాజ్యాంగానికి లోబడి ఉండాలనేది తమ ప్రభుత్వ దృక్పథమని జైట్లీ వివరించారు. దేశం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించుకోవడానికి కృషి చేస్తుందని రాజ్యాంగ నిర్మాతలు తాము పొందుపరచిన ఆదేశిక సూత్రాలలో ఆశించారని పేర్కొన్నారు.