జాతీయ వార్తలు

హిందుత్వ తీర్పుపై మళ్లీ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు మతాన్ని దుర్వినియోగం చేయడం ‘అవినీతి చర్యే’ అవుతుందని స్పష్టం చేస్తూ హిందుత్వంపై రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన తన తీర్పుపై మళ్లీ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు సిద్ధమైంది. ఈ అంశాన్ని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించాలని 2014 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్‌తో పాటు సుప్రీం కోర్టు ఎంబి.లోకుర్, ఎంఎ.బోబ్డే, ఎకె.గోయల్, యుయు.లలిత్, డివై.చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావులతో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. హిందుత్వం పేరుతో ఓట్లు అడగడం ఏ అభ్యర్థి పైనా దుష్ప్రభావం చూపదని 1995లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రశ్నలు తలెత్తడం, అప్పటి నుంచి ఈ అంశానికి సంబంధించిన మూడు ఎన్నికల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా జరుగునున్న విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. హిందుత్వం అనేది ప్రజల జీవన విధానమని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం 1995లో పేర్కొంది. అప్పట్లో మనోహర్ జోషికి, ఎన్‌బి.పాటిల్‌కు మధ్య సాగిన కేసులో ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.