జాతీయ వార్తలు

ఇఎస్‌ఐకి బదులుగా ఇతర బీమా పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: సాధారణ రంగంలోని రెండు కోట్ల మందికి పైగా కార్మికులకు త్వరలో ప్రభుత్వ కార్మిక బీమా సంస్థ (ఇఎస్‌ఐసి) పథకానికి బదులుగా మార్కెట్లో ఉన్న ఇతర ఆరోగ్య బీమా పథకాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం నెలకు 21వేల రూపాయల లోపు స్థూల వేతనం పొందుతున్న కార్మికులకు ఇఎస్‌ఐసి ఆధ్వర్యంలోని ఆరోగ్య బీమా పథకాన్ని తప్పనిసరిగా వర్తింపజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇఎస్‌ఐసి-1948 చట్టాన్ని సవరించడం ద్వారా ప్రభుత్వ కార్మిక బీమా సంస్థ లబ్ధిదారులకు మార్కెట్లో ఉన్న ఇతర ఆరోగ్య బీమా పథకాలను కూడా ఎంపిక చేసుకునేలా వీలు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును త్వరలో కేంద్ర మంత్రివర్గానికి పంపనున్నట్లు కార్మిక శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇఎస్‌ఐ పథకం పరిధిలోని కార్మికులకు బీమా నియంత్రణా సంస్థ ఐఆర్‌డిఎ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ) నుంచి గుర్తింపు పొందిన ఇతర సంస్థల ఆరోగ్య బీమా పథకాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తామని సార్వత్రిక బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనకు అనుగుణంగా కార్మిక శాఖ ఈ చర్య చేపడుతోంది. ఇఎస్‌ఐ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అంతర్ మంత్రిత్వ శాఖల స్థాయిలో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని ఆ అధికారి వెల్లడించారు.
అయితే ఇఎస్‌ఐ చట్టాన్ని సవరించేందుకు సర్కారు ప్రతిపాదించిన బిల్లును పలు కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య బీమా చట్టం కింద కార్మికులకు కల్పిస్తున్న ప్రయోజనాలతో సరితూగే ఇతర ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతే ఇఎస్‌ఐ చట్టాన్ని సవరించాలని ఆ సంఘాలు కార్మిక శాఖను డిమాండ్ చేస్తున్నాయి.