జాతీయ వార్తలు

కొట్టి చంపాల్సిందే.. ఉరి తీయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచారం, దారుణ హత్యతో పాటు దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న సామూహిక దాడుల ఉదంతంపై రాజ్యసభ నిప్పులు చెరిగింది. రేపిస్టులను కొట్టి చంపాలని, ఉరి తీయాలని ఇలాంటి అకృత్యాలకు పాల్పడకుండా ఈ ఉన్మాదులను మరో ‘రకంగా’ శిక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసే వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఎస్‌పీ సభ్యురాలు, ప్రముఖ నటి జయాబచ్చన్ డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే సభ్యురాలు విజిలా సత్యనాథ్ కంటతడి పెడుతూ ఎంత కాలం ఈ అత్యాచారాలను భరించాలని ప్రశ్నించారు. రాజ్యసభ సోమవారం జీరో అవర్‌ను పక్కన పెట్టి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించింది. నిర్భయ చట్టం ఉన్నా ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది ఆలోచన చేయాలని ఇరుపక్షాల సభ్యులు చెప్పారు. మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి, అత్యాచారాలకు పాల్పడే వారిని అత్యంత కఠినంగా శిక్షించేందుకు చట్టాన్ని సవరించాలి, చట్టాలను మరింత పటిష్టం చేయాలి, పోలీసు పెట్రోలింగ్ పెంచాలి, నిందితులను శిక్షించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, నిందితుల ఆస్తులను జప్తు చేయటంతోపాటు వారి పేర్లు, ఫొటోలను సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయాలి, పోలీసులు పరిధి గురించి ఆలోచించకుండా ఫిర్యాదును వెంటనే రిజిష్టరు చేసి దర్యాప్తు ప్రారంభించే విధంగా వ్యవస్థను జాగృతం చేయాలని ఇరుపక్షాలకు చెందిన సభ్యులు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్టం చేయటంతో పాటు పోలీసులు పరిధితో సంబంధం లేకుండా ఫిర్యాదును వెంటనే రిజిష్టరు చేసుకుని దర్యాప్తు ప్రారంభించేందుకు తగు నిర్ణయాలు తీసుకోవాలని అధికార, ప్రతిపక్షానికి చెందిన సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మహిళలపై కొనసాగుతున్న అత్యాచారాలపై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. మహిళలపై అత్యాచారాలు జరగకుండా చూసేందుకు మొత్తం దేశం, సమాజం లేచి నిలబడాల్సిన అవసరం ఉన్నదని రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాంనబీ ఆజాద్ అభిప్రాయపడ్డారు. మహిళలపై అత్యాచారాలు చేసే వారిని అత్యంత కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్టం చేయాలని ఆజాద్ ప్రతిపాదించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని కులం, మతం, ప్రాంతం భేదం చూపించకుండా అత్యంత కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో వెళ్లి ఉంటే హైదరాబాదులో ఒక యువతి అత్యాచారానికి, హత్యకు గురయ్యేది కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎంఏఖాన్ స్పష్టం చేశారు. అత్యాచారానికి గురైన యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకునేందుకు స్థానిక పోలీసులు నిరాకరించటం సిగ్గుచేటని ఖాన్ దుయ్యబట్టారు. బాధితులు, వారి బంధువులు ఇచ్చే ఫిర్యాదును పోలీసులు వెంటనే నమోదు చేసుకుని తగు చర్యలు తీసుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పోలీసు శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఖాన్ డిమాండ్ చేశారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నిందితులను శిక్షిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఈ విచారణకు ఒక కాలపరిమితి తప్పకుండా విధించాలని ఆయన స్పష్టం చేశారు. మహిళల అత్యాచారాలకు సంబంధించిన కేసులను కులాలు, మతాలతో ముడిపెట్టకూడదన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు న్యాయ వ్యవస్థను కూడా పటిష్టం చేయాల్సి ఉందని, నిందితులకు విధించే ఉరి శిక్షను తరువాత యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే పద్ధతి పోవాలని టీఆర్‌ఎస్ సభ్యుడు బండా ప్రకాశ్ సూచించారు. పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయాలేదంటూ బాధులైన పోలీసులపై చర్య తీసుకోవాలని సుఖేందు రాయ్ డిమాండ్ చేశారు. సమాజంలో మార్పు తెచ్చేందుకు మనమంతా కృషి చేయాలని బీజేపీ సభ్యుడు భుపేందర్ యాదవ్ సూచించారు. మహిళల పట్ల ఆత్యాచారాలు రోజు, రోజుకు పెరిగిపోతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శాంతను సేన్ చెప్పారు. మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు తమ పరిధి గురించి పట్టించుకోకుండా వెంటనే ఫిర్యాదును రిజిష్టరు చేసి దర్యాప్తు ప్రారంభించాలని తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ సూచించారు. పరిధి గురించి ఆలోచించకుండా వెంటనే ఫిర్యాదును రిజిష్టరు చేసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని అమలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్భయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, పెట్రోలింగ్ పెంచాలి, వెంటనే న్యాయం జరిగేందుకు సత్వర విచారణ కోర్టులను ఏర్పాటు చేయాలని రవీంద్ర కుమార్ సూచించారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను ఉరి తీయాలనే డిమాండ్ ప్రజల నుండి వస్తోంది, అయితే ఇది మంచి పరిణామం కాదు, కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్ష ఇప్పించగలిగినప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుందని ఆయన చెప్పారు. సమాజంలో పెను మార్పు వచ్చినప్పుడే ఇలాంటి సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్ సభ్యురాలు అమీ యాగ్నిక్ అభిప్రాయపడ్డారు. సీసీ-టీవీల సంఖ్య పెంచాలని సంజయ్ సింగ్ తదితరులు సూచించారు. డ్రైవింగ్ లైసన్స్ లేదని తెలిసినా ఆర్‌టీఏ అధికారులు లారీ డ్రైవర్‌ను ఎందుకు వదిలి వేశారని బీజేపీ సభ్యుడు పట్నాయక్ ప్రశ్నించారు. వెటర్నరీ వైద్యురాలిపై దాడి జరిగిన చోటే ఒక రోజు ముందు ఇలాంటి మరో సంఘటన జరిగినట్లు తెలిసింది, ఇంత జరిగినా పోలీసులు ఎందుకు వెంటనే స్పందించలేదని జయాబచ్చన్ ప్రశ్నించారు.