జాతీయ వార్తలు

‘విక్రమ్’ జాడ దొరికింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబర్ 3: చంద్రుడికి అతి సమీపంలోకి వెళ్లి కూలిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) కనుగొంది. నాసాకు చెందిన లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌ఓ) విక్రమ్ శకలాలతో చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశఓలను స్పష్టం గుర్తించింది. ఈ మేరకు ఆ చిత్రాలను తీసి పంపింది. విక్రమ్ శకలాలు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 24చోట్ల పడినట్లు గుర్తించింది. భారత అంతరిక్ష కేంద్రం షార్ ప్రయోగాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-2 అనుకున్న రీతిలో విజయం సాధించలేకపోయినా ప్రపంచ వ్యాప్తంగా మన శాస్తవ్రేత్తలు ఎన్నో ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే అనుకోని పరిస్థితుల్లో అర్ధాంతరంగా మన స్పేస్ స్టేషన్ నుండి సిగ్నిల్ తెగిపోవడంతో చంద్రయాన్-2 ప్రయోగం అనుకున్న లక్ష్యం సాధించలేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. అయితే చందమామ దక్షిణ తీరంలో పడిపోయిన విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో అమెరికాకు చెందిన నాసా కనిపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా విడుదల చేసింది. చంద్రయాన్-2 అతి ముఖ్యమైన, ప్రభావంతమైన విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్ తెగిపోయిన తరువాత చందమామ దక్షిణ ధ్రువంలో పడిపోయిన విషయం తెలుసు కానీ చందమామపై ఉన్న చీకటి వల్ల ఇన్ని రోజులు అది ఎక్కడ పడిపోయిందో కనుగొనలేకపోయారు. ఇదే క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది. తమిళనాడుకు చెందిన షణ్ముఖ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి
ఎల్‌ఆర్‌ఓ ప్రాజెక్టు సభ్యులను సంప్రదించారు. ఆయన తొలిసారిగా విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించి ఓ విడి భాగాన్ని, అది పడిన ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో గుర్తించారు. తద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందో తెలిసింది. ఇక కూలిన ల్యాండర్ నుండి కొన్ని శకలాలు చిందరవందరంగా పడినట్లు నాసా గుర్తించింది. మొత్తం 24 చోట్ల శకలాలు పడినట్లు గుర్తించింది. మొత్తంమీద కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఇవి చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఒకవేళ విక్రమ్ ల్యాండర్ కనుక అనుకున్న నిర్ధేశిత కోణంలో చంద్రుడిపై పడి ఉంటే దానిని ఎందుకయితే చంద్రునిపైకి పంపించారో ఆ ప్రక్రియ ఇప్పటికీ విజయవంతంగా చేసి ఉంటుందని మన శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ల్యాండర్ నుండి విడిపోయిన భాగాలు మినహాయిస్తే ల్యాండర్‌కు అనుసంధానమై ఉన్న వాటి ద్వారా అది ఇప్పటికీ సమాచారాన్ని సేకరించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈనేపథ్యంలో మన శాస్తవ్రేత్తల శ్రమ వృథా కాలేదని చెప్పాలి. జూలైలో ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా, రష్యా, చైనా తరువాత చంద్రుడిపై ల్యాండర్‌ను దింపిన దేశం మన భారతదేశం. అంతేకాక చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపిన తొలి దేశం కూడా మన భారతదేశమే. ప్రస్తుతం చంద్రయాన్-2లో కీలకమైన ఆర్బిటర్ చందమామ చుట్టూ విజయవంతంగా తిరుగుతోంది. విక్రమ్ ల్యాండర్ అందులోని ప్రజ్ఞాన్ రోవర్ మాత్రం పని చేయడం లేదు.
*చిత్రాలు.. విక్రమ్ శకలాలను గుర్తించడానికి తోడ్పడిన భారత శాస్తవ్రేత్త షణ్ముఖ సుబ్రహ్మణ్యం
* చంద్రుడి ఉపరితలంపై ఆనవాళ్లు