జాతీయ వార్తలు

‘హిందూత్వ’ ర్యాలీని అడ్డుకొన్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 4: హిందూ సంస్థలకు చెందిన సభ్యులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బుధవారం ఇక్కడ హిందూ జాగరణ్ మంచ్ చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కోల్‌కతాలోని సీల్దా ప్రాంతంలో హిందూ జాగరణ్ మంచ్ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు. బారికేడ్లను సైతం తోసుకొంటూ వచ్చిన వేలాది మంది ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొన్నారు. పరిస్థితి అదుపు తప్పుతున్న తరుణంలో పోలీసుల లాఠీచార్జి చేశారు. దీంతో వేలాది మంది హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని సమీప జైళ్లకు తరలించడంతో పరిస్థితి మరింత అదుపుతప్పింది. సీల్దా నుంచి ప్రారంభమైన ర్యాలీని పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు డిప్యూటీ పోలీసు కమిషనర్ సుధీర్ కుమార్ నేతృత్వంలో వందలాది పోలీసులను మోహరించారు.