జాతీయ వార్తలు

చట్ట సభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పార్లమెంటు, శాసన సభల్లో షెడ్యూల్డు కులాలు, తెగల రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగించే ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర మంత్రి వర్గం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ రిజర్వేషన్లను తొలగించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని షెడ్యూలు కులాలు, తెగల వారికి పార్లమెంటు, శాసన సభల్లో కల్పించిన సీట్ల రిజర్వేజన్ల కాల పరిమితి 2020 జనవరి 25తో ముగుస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో సీట్ల రిజర్వేషన్ కొనసాగాలంటే వీటిని పొడిగించాల్సి ఉంటుంది. మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఎస్సీ, ఎస్టీలకు చట్ట సభల్లో కల్పించిన రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు అంటే 2030 సంవత్సరం జనవరి 25వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ పొడిగింపునకు సంబంధించిన బిల్లును త్వరలోనే పార్లమెంటు శీతాకాల సమావేశల్లో ప్రతిపాదిస్తారు. ఇదిలాఉండగా పార్లమెంటు, చట్ట సభల్లో ఆంగ్లో ఇండియన్లకు కల్పించిన రిజర్వేషన్లను మాత్రం మోదీ ప్రభుత్వం పొడిగించటం లేదు. మోదీ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం మేరకు 2020 జనవరి 25 తరువాత ఆంగ్లో ఇండియన్లకు చట్ట సభల్లో ఎలాంటి రిజర్వేషన్లు కొనసాగవు. ఆంగ్లో ఇండియన్ల ఆర్థిక, సమాజిక పరిస్థితి ఎంతో బాగున్నందున వారికి చట్ట సభల్లో రిజర్వేషన్లు అవసరం లేదని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. అంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు అవసరమని భావించే పక్షంలో భవిష్యత్తులో వీటిని పునరుద్దరించవచ్చునని బీజేపీ నాయకులు చెబుతున్నారు. పార్లమెంటులో షెడ్యూల్డు కులాలకు చెందిన వారు 84 మంది, షెడ్యూల్డు తెగల వారు 47 మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల శాసన సభల్లో 614 ఎస్సీ సభ్యులు, 554 మంది గిరిజనులు ఉన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌లను నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా ప్రతి శాసన సభకు ఒక్కరి చొప్పున ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేయవలసి ఉంటుంది. ఆంగ్లో ఇండియన్లను లోకసభకు భారత రాష్టప్రతి నామినేట్ చేస్తే శాసన సభలకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు నామినేట్ చేస్తారు. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక మీదట ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే ప్రక్రియకు తెర పడుతుంది.