జాతీయ వార్తలు

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోకి సంచార, విముక్త జాతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సంచార, విముక్తజాతుల వారిని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకునిరావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా అణగారిన వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన రక్షణను సంచార, విముక్తజాతుల వారికి కూడా వర్తింపజేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. సమాజంలోని అణగారిన వారికి రక్షణ కల్పించే ప్రక్రియలో భాగంగా అమలులోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి సంచార, విముక్త జాతుల వారిని తీసుకుని రావాల్సిన అవసరం ఎంతో ఉన్నదని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తెచ్చి సంచార, విముక్త జాతుల వారిని వదిలివేయటం దురదృష్టకరమని ఆయన బాధ పడ్డారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా సంచార, విముక్త జాతుల వారు దయనీయమైన జీవనం సాగిస్తున్నారని ఆయన చెప్పారు. అత్యాచార నిరోధక చట్టం పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే సంచార, విముక్త జాతుల వారు అధిక దౌర్జన్యాలు, దోపిడీలకు గురి అవుతున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. సంచార, విముక్త జాతుల వారు ఇప్పటికి కూడా దౌర్జన్యాలు, దోపిడీలకు గురవుతున్నారు, వారికి రక్షణ కల్పించే వ్యవస్థ లేదని ఆయన వాపోయారు. అందుకే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి సంచార, విముక్త జాతుల వారిని కూడా తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు.
ఉత్తరాంధ్రలో పైప్ ద్వారా గ్యాస్
కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో తొమ్మిది లక్షల 29 వేల ఇళ్లకు పైపు ద్వారా వంట గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌తో ఓప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెళ్లడించారు. వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ప్రధాన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ స్టేషన్లను మూడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తుందని మంత్రి చెప్పారు. నిర్దేశించిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌ను అభివృద్ది చేసే అధికారం పిఎన్‌జిఆర్‌బికి ఉన్నదని మంత్రి తెలిపారు.

*చిత్రం...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి