జాతీయ వార్తలు

‘ఉత్తరాంధ్రాకే ఆన్సూ’ ఆవిష్కరించిన ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర నీటి వనరులు, నీటి ప్రాజెక్ట్‌లు, సమస్యలు, పరిష్కార మార్గాలు అనే అంశాలపై వైజాగ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు అయిన నేషనల్ జర్నలిస్టు యూనియన్ ప్రతినిధి నాగబోయిన నాగేశ్వర్‌రావు రాసిన ‘ఉత్తరాంధ్ర కన్నీళ్లు’ హిందీ అనువాదం ‘ఉత్తరాంధ్రాకే ఆన్సూ’ పుస్తకాన్ని బుధవారం ఉదయం పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రచయిత నాగేశ్వర్‌రావుల సమక్షంలో ప్రధాని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని పరిశీలించిన ప్రధాని నీటి గురించి చేసే ప్రయత్నం చాలా గొప్పదని, ఉత్తరాంధ్ర నీటి అవసరాలు ఈ పుస్తకంలో స్పషంగా రాయడం, ఈ రీతిలో మొదటిసారిగా పుస్తకాన్ని రచించిన రచయిత సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్‌రావుతో పాటు ఈ పుస్తక పబ్లిషర్ చాంద్‌మాల్ అగర్వాల్‌ను ప్రధాని అభినందించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ అనువాదకురాలు పారినంది నిర్మల అనువదించారని ఈ సందర్భంగా ఢిల్లీ నుండి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలిపారు. ప్రేమ్ పబ్లికేషన్ తరపున చాంద్‌మాల్ ఆగర్వాల్ తమకు చేయూతను అందిస్తూ ఈ పుస్తకాన్ని ముద్రించారని తెలిపారు. ‘ఉత్తరాంధ్రకే ఆసు’ పుస్తకాన్ని రచించిన రచయిత అయిన సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్‌రావును తెలంగాణ జర్నలిస్టు అసోసియోషన్, జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్, ఎన్‌యుజే కార్యదర్శి సిల్వేరీ శ్రీశైలం అభినందనలు తెలిపారు.
*చిత్రం... పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ‘ఉత్తరాంధ్రాకే ఆన్సూ’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చిత్రంలో పుస్తక రచయిత సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్‌రావు