జాతీయ వార్తలు

శ్రీనగర్‌లో ఐదోరోజూ విమానాల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 11: వరుసగా ఐదోరోజైన బుధవారం సైతం శ్రీనగర్ నుంచి విమానాల రాకపోకలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. భారీగా కురుస్తున్న మంచు కారణంగా పైలట్లకు గగనతల మార్గాలను కనుగొనడం ఇబ్బందికరంగా మారడం వల్లే ఇలా రద్దును కొనసాగించాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు స్పష్టం చేశారు. విమానాలు నడపాలంటే సాధారణంగా 1000 నుంచి 1,200 మీటర్ల దూరం వరకు పైలట్‌కు కనిపించాలని, ఐతే ప్రస్తుతం 100 మీటర్ల దూరానికి మించి కనిపించే పరిస్థితులు లేవని ఆ అధికారులు తెలిపారు. సుమారు ఆరు రోజులుగా శ్రీనగర్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలూ జరగడం లేదని ఈ కారణంగా తాను తీవ్ర నిరాశకు గురై వరుసగా రెండోరోజు విమానాశ్రయం నుంచి వెనక్కు వెళుతున్నానని ఈ సందర్భంగా వాసిం నజీర్ అనే ప్రయాణికుడు పేర్కొన్నారు. మంచు తీవ్రత కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి మూతపడి ఉంటుంది కాబట్టి ఈ లోయలోని ప్రజలందరికీ విమానమార్గమే దిక్కని, బుధవారం నుంచి జమ్మూ -కాశ్మీర్, లడఖ్‌లలో వాతావరణ పరిస్థితులు సానుకూలంగా మారుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.