జాతీయ వార్తలు

‘అయోధ్య’ చుట్టూ యుపి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య/న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఈ ఎన్నికల్లో అయోధ్య అంశం జోలికి పోయేది లేదని బిజెపి వర్గాలు చెబుతున్నప్పటికీ ‘రాముడు చుట్టూనే’ ఎన్నికల వ్యవహారం కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాముడి సేవ చేసే ఎవరైనా అదృష్టవంతులనీ, రాష్ట్రంలో ఈ బాధ్యతను అప్పగిస్తే అంతకుమించిన ఆనందం తమకు మరొకటి లేదంటూ కేంద్ర మంత్రి మహేశ్ శర్మ మంగళవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఈ బాధ్యతను దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీకి అప్పగించారని అన్యాపదేశంగా యుపి ఎన్నికలు కూడా ‘అయోధ్య’ చుట్టూనే తిరగబోతున్నాయన్న సంకేతాలను ఆయన అందించారు. రామాయణ మ్యూజియాన్ని ఏర్పాటుచేయడానికి ఉద్దేశించిన ప్రాంతాన్ని సందర్శించేందుకు అయోధ్యలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు కాంప్లెక్స్‌కు పదిహేను కి.మీ దూరంలో ఉంది. దాదాపు 25 ఎకరాల్లో ఈ మ్యూజియాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు బిజెపి అతివాదుల్లో మరింత ఉత్సాహాన్ని అందించాయి. 1992లో బాబ్రీని కూల్చిన చోట రామాలయాన్ని నిర్మించాలంటూ వినయ్ కతియార్ సహా అనేకమంది బిజెపి అతివాదులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రామాలయ నిర్మాణానికి సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కతియార్ ఇప్పటికే డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకూ కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రయత్నం జరగలేదని, కేవలం మొక్కుబడి హామీలతోనే కాలక్షేపం చేస్తున్నారని ఆయన మంగళవారం నాడు తీవ్ర స్వరంతో అన్నారు. అయోధ్య అంశాన్ని రాజకీయంగా వాడుకునే పోటీ తీవ్రమవుతోందని, మ్యూజియం నిర్మాణానికి యుపి సర్కార్ పాతిక ఎకరాలు ఇచ్చిందని, అలాగే మరోచోట రామ్‌లీలా నేపథ్యంతో మరో పార్కు కూడా నిర్మితమవుతోందని ఆయన తెలిపారు.
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రామాయణం మ్యూజియాన్ని, అయోధ్య అంశాన్ని బిజెపి ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది.