జాతీయ వార్తలు

బెంగాల్ గవర్నర్ తీరు బాగా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: పశ్చిమ బెంగాల్ గవర్నర్ తీరు బాగా లేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ విమర్శించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన లోక్‌సభలో కోరారు. బుధవారం సభలో బంధోపాధ్యాయ ప్రసంగిస్తూ ఎస్‌సీ, ఎస్‌టీల కమిషన్ బిల్లును గవర్నర్ అసెంబ్లీకి పంపించడం లేదని చెప్పారు. ఇలాంటిది లోగడ ఎప్పుడూ లేదన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో చర్చించేందుకు అజెండా లేకపోవడంతో స్పీకర్ భీమన్ బెనర్జీ సభను నిరవధికంగా వాయిదా వేశారని ఆయన తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 29న ప్రారంభమయ్యాయని, ఈ శుక్రవారం వరకు కొనసాగుతాయని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి తపస్ రాయ్ చెప్పారు. ముఖ్యమైన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా తన వద్దే ఉంచుకున్నాడని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో అజెండా లేకపోవడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారని వారు విమర్శించారు.