జాతీయ వార్తలు

వ్యాధి లేని వ్యక్తికి శస్త్ర చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 11: ‘వ్యాధి లేని వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుకు ప్రయత్నించిన నేరంలా ఉంది..’ అని మక్కల్ నీధి మైయం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ పౌరసత్వ సవరణ బిల్లుపై మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లుపై కమల్‌హాసన్ మండిపడ్డారు. పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. బుధవారం రాజ్యసభలోనూ ఈ బిల్లు ఆమోదం కోసం ప్రతిపాదించింది. ఇలాఉండగా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కమల్‌హాసన్ తూర్పారబట్టారు. భారత దేశాన్ని ఒక సమూహం మాత్రమే నివసించే దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలో అన్ని మతాల సమ్మేళనం ఉండగా కేంద్రం వివక్ష చూపిస్తున్నదని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రాజ్యాంగంలో ఏదైనా లోపం ఉన్నట్లయితే తప్పని సరిగా సవరణ చేసుకోవాలన్నారు. అయితే ఆ సవరణ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటుపొడిచేలా ఉండరాదని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ బిల్లును వ్యతిరేకించాలని కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి.

*చిత్రం... మక్కల్ నీధి మైయం (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్