జాతీయ వార్తలు

ఉగ్రవాదాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: బ్రిక్స్ డిక్లరేషన్‌లో సీమాంతర ఉగ్రవాదంను ప్రస్తావించేలా చేయడంలో భారత్ విఫలమైందన్న విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చుతూ ప్రభుత్వ ప్రోత్సాహిత, ప్రభుత్వ రక్షణలోని ఉగ్రవాదం కన్నా పెద్దముప్పు మరోటి లేదని సదస్సు గుర్తించిందని, ఉగ్రవాదం విషయంలో ఇంతకుముందు మాదిరిగా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిందని పేర్కొంది. గోవాలో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సులో చేపట్టిన తీర్మానంలో ఉగ్రవాదం ముప్పునకు సంబంధించి ప్రతి దేశం చాలా గట్టిగా మాట్లాడింది, అలాగే ఉగ్రవాదాన్ని విస్మరిస్తే కొరివితో తల గోక్కున్న చందంగా తయారవుతుందనే వాస్తవాన్ని సైతం గుర్తించిందన్నారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించిన సుష్మ ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు అంటూ వేరు చేసి చూడ్డమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ, వారికి మద్దతిస్తూ, ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆవాసాలు కల్పిస్తున్న దేశాలు ఉగ్రవాదం వల్ల నష్టపోయిన దేశాలకు పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. బిమ్‌స్టెక్ దేశాలకు, పాకిస్తాన్‌కు మధ్య ఎంతో తేడా ఉందని, బిమ్‌స్టెక్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా చేసుకునే ధోరణికి పూర్తి వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నాయన్నారు. మంగళవారం ఇక్కడ బ్రిక్స్ మీడియా ఫోరమ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ సుష్మాస్వరాజ్ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం విషయంలో ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదనే ఏకాభిప్రాయం ఏర్పడుతోంది. ఉగ్రవాదులను ప్రోత్సహించే, వారికి మద్దతు ఇచ్చే, అలాగే వారికి ఆశ్రయం కల్పించే, ఉగ్రవాదానికి తాము కూడా బలవుతున్నామని చెప్పుకొంటూ కూడా ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉంటారని చెప్తూ ఉండే వారినుంచి అందుకు మూల్యాన్ని రాబట్టడానికి మనం సిద్ధం కావాలని సుష్మ అన్నారు. బ్రిక్స్ ఎప్పుడు కూడా అంతర్జాతీయంగానే ఆలోచిస్తోందని, ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదానికన్నా అంతర్జాతీయ ముప్పు ఇంకోటి లేదని కూడా ఆమె చెప్పారు. సార్క్ దేశాల్లో రవాణా, కనెక్టివిటీకి సంబందించిన అనేక ఒప్పందాలను పాక్ అడ్డుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సుష్మ, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ దేశాలు సభ్యులుగా ఉండే బిమ్‌స్టెక్‌తో భారత్ సన్నిహితంగా కలిసి పని చేస్తుందని అన్నారు.