జాతీయ వార్తలు

ఎవరికెన్ని నీళ్లు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 18: కృష్ణా జలాల కేటాయింపులపై బుధవారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించనుంది. కృష్ణా నదీ జలాల కేటాయింపులు నాలుగు రాష్ట్రాల మధ్యా? లేక రెండు రాష్ట్రాల మధ్య జరపాలా? అన్న అంశంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ స్పష్టత ఇవ్వనుంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 పరిధిపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్రం వినిపించిన వాదనలు సెప్టెంబర్ 8తో ముగిసాయి. సెక్షన్ 89 పరిధి కేవలం ఏపీ, తెలంగాణలకే పరిమితమా? లేక కర్ణాటక, మహారాష్టల్రకూ వర్తిస్తుందా? అనే దానిపై ట్రిబ్యునల్ స్పష్టత ఇవ్వనుంది. కృష్ణా వివాదాన్ని బ్రిజేష్ ట్రిబ్యునల్ రెండున్నరేళ్లుగా విచారిస్తోంది. జలాల పంపిణీ విషయంలో
కృష్ణా పరీవాహక ప్రాంతంలోని నాలుగు రాష్ట్రాలనూ పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ, ఏపీలు వాదించాయి. విభజన చట్టం కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాబట్టి తమను పునఃపంపిణీ పరిధిలోకి తేవొద్దని కర్ణాటక, మహారాష్టల్రు స్పష్టం చేశాయి. కేంద్రం సైతం సెక్షన్ 89 పరిధి రెండు కొత్త రాష్ట్రాలకే పరిమితమని ట్రిబ్యునల్‌కి వివరించింది. బ్రిజేష్ టిబ్యునల్ 2010లో మధ్యంతర అవార్డును, 2013లో తుది అవార్డును వెలువరించినప్పటికీ, అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అవార్డును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో అవార్డును గెజిట్‌లో ప్రకటించొద్దంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. పిటీషన్ సుప్రీం కోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఉమ్మడి ఏపీ అభ్యంతరాలపై తరువాత ట్రిబ్యునల్‌లో వాదనలు జరిగాయి. నీటి లభ్యత తక్కువగావున్న సమయాల్లో ఆపరేషన్ ప్రోటోకల్ ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా, నాలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులవారీ కేటాయింపులపైనా ఎవరి వాదనలు వారు వినిపించారు. అయితే ఈ వాదనలు జరుగుతున్న సమయంలోనే ఏపీ విభజన జరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు జరపాలంటూ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల విచారణ తర్వాత ట్రిబ్యునల్ వెలువరించనున్న తీర్పు నాలుగు రాష్ట్రాలకూ కీలకం కానుంది. ఈ తీర్పు ద్వారా ముఖ్యంగా మూడు అంశాలపై స్పష్టత రావొచ్చు. ప్రధానంగా ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 రెండు రాష్ట్రాలకేనా? లేక నాలుగు రాష్ట్రాలకు వర్తింపచేయాలా? అనే దానిపై స్పష్టత వస్తుంది. అలాగే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు, నీటి లభ్యత తక్కువగావున్న సమయాల్లో ఆపరేషన్ ప్రోటోకాల్ వ్యవహారంపైనా ఇప్పుడు ట్రిబ్యునల్ స్పష్టత ఇవ్వనుంది. అయితే ట్రిబ్యునల్ తీర్పు ఎలావున్నా, దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు నాలుగు రాష్ట్రాలూ సమాయత్తమవుతున్నాయి. సెక్షన్ 89 రెండు రాష్ట్రాలకే పరిమితం చేస్తే ఏపీ, తెలంగాణలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాయి. ఒకవేళ అదే సెక్షన్‌ను నాలుగు రాష్ట్రాలకు వర్తింపచేస్తూ తీర్పునిస్తే, మహారాష్ట్ర, కర్ణాటకలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.