జాతీయ వార్తలు

టాప్ వర్శిటీల్లో జెఎన్‌యు, హెచ్‌సియూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జెఎన్‌యు, హైదరాబాద్ యూనివర్సిటీలు అత్యుత్తమ వర్సిటీల జాబాతాలో చోటు సంపాదించుకున్నాయి. అత్యుత్తమ సాంకేతిక, మేనేజ్‌మెంట్ కళాశాలలుగా ఐఐటి (మద్రాసు), ఐఐటి (బెంగళూరు) నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ జాబితా విడుదల చేసింది. సాంకేతిక సంస్థల జాబితాలో ముంబై ఐఐటి రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానంలో ఐఐటి-్ఢల్లీ, ఐఐటి-కాన్పూరు నిలిచాయి. ఫార్మా ఎడ్యుకేషన్ కేటగిరిలో మణిపాల్ కాలేజీ మిగతావాటి కంటే ముందుంది. నాలుగు వేర్వేరు కేటగిరిలలో 3,500 వివిధ సంస్థలను పరిగణనలోకి ఈ ర్యాంకింగ్‌లను జనశక్తి వనరుల మంత్రిత్వ శాఖ రూపొందించింది. యూనివర్సిటీల కేటగిరిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు టాప్ ర్యాంకు సాధించింది. తదుపరి స్థానంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసిటి) ముంబై నిలిచింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ నాలుగోస్థానంలో నిలిచింది. విద్యా సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పుతూ తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉత్తమ విద్యా సంస్థలపై అవగాహన కల్పించేందుకు భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ భారత్‌లోని అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాను రూపొందించింది. నిపుణుల కమిటీ ఈ ర్యాంకులు ఇవ్వగా, బోధన, వసతులు, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, పరిశోధన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, మేనేజిమెంట్ సంస్థల్లో ఐఐఎం బెంగళూరు లీడింగ్‌లో ఉండగా, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కోల్‌కతా, ఐఐఎం లక్నో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. వార్షిక ప్రక్రియలో భాగంగానే ర్యాంకింగ్‌లు ఇవ్వడం జరిగిందని, మరిన్ని కేటగిరిలను చేర్చడం వల్ల ఆయా విద్యాసంస్థల గురించిన సమాచారాన్ని విద్యార్థులు తెలుసుకునే వీలుంటుందని జాబితా విడుదల అనంతరం కేంద మంత్రి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.