జాతీయ వార్తలు

త్వరలోనే జయ డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 20: అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, త్వరలోనే ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అవుతారని అన్నాడిఎంకె ప్రకటించింది.‘విదేశీ నిపుణులు, అపోలో వైద్యుల పర్యవేక్షణలో అమ్మకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజురోజుకు ఆమె ఆరోగ్యపరిస్థితి మెరుగవుతోంది’అని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి గురువారం వెల్లడించారు. ప్రజల క్షేమం కోసం జయలలిత తన జీవితాన్ని అంకితం చేశారని ఆమె తెలిపారు. కొద్ది కాలం విశ్రాంతి తీసుకోవల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని సరస్వతి స్పష్టం చేశారు. ఏది ఏమైనా దేవుని దయవల్ల అమ్మ కోలుకుంటోంది, త్వరలోనే డిశ్చార్జి అవుతారని ఆమె పేర్కొన్నారు. జయలలిత పథకాలతో లబ్ధిపొందిన వారెందరో ఆమె రాకకోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 68 ఏళ్ల జయలలిత తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్‌తో అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు వైద్య సేవలందించడానికి లండన్ నుంచి నిపుణులైన వైద్యులు, ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యుల బృందం చెన్నై వచ్చి జయకు వైద్య సేవలందించారు. అన్నాడిఎంకె మాజీ మంత్రి, బిజెపి నేత హెచ్‌వి హండే కూడా జయలలిత త్వరలోనే ఇంటికి వస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం అపోలో ఆసుపత్రికి వచ్చిన ఆయన వైద్యులు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైను కలిసి జయ ఆరోగ్యం గురించి వాకబుచేశారు. వారం పది రోజుల్లోనే జయ ఇంటికి వస్తారన్న ధీమా హండే వ్యక్తం చేశారు. ఇలా ఉండగా తమ ప్రియతమ అధినేత్రి త్వరగా కోలుకోవాలంటూ అన్నాడిఎంకె కార్యకర్తలు ప్రార్ధనలు చేశారు.