జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు రీటా టాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. పిసిసి మాజీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రీటా బహుగుణ జోషి గురువారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె బిజెపిలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు హేమవతీ నందన్ బహుగుణ కుమార్తె అయిన రీటా బహుగుణ బిజెపిలో చేరటంతో రాష్ట్రంలోని బ్రాహ్మణ వర్గం ఆ పార్టీవైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు. రీటా బహుగుణ సోదరుడు ఇదివరకే ఉత్తరాఖండ్‌కు చెందిన తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కొంతకాలం క్రితం బిజెపిలో చేరటం తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ నాయకుల మాట వినకుండా అవుట్‌సోర్సర్ ప్రశాంత్ కిశోర్ మాట వింటాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన రీటా బహుగుణ ఇటీవల భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులను సమర్థించారు. నరేంద్ర మోదీ సైనికుల రక్తంతో బ్రోకర్ పని చేస్తున్నాడంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రీటా బహుగుణ ఖండించారు. రాహు ల్ వ్యవహరిస్తున్న తీరు మూ లంగా పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆవేదన చెందుతున్నారని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌లో చాలామంది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించటం లేదని రీటాబహుగుణ తెలిపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలనే నిర్ణయం సులభంగా తీసుకున్నది కాదు, ఈ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాను, అన్ని పరిస్థితులను సమీక్షించుకున్న తరువాతనే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వివరించారు. దేశంతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రయోజనాల కోసం బిజెపిలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్‌కు తాను ఇరవై నాలుగేళ్ల పాటు సేవ చేశాను, అయితే ఇటీవల సంభవించిన కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయని బహుగుణ జోషి తెలిపారు. సర్జికల్ దాడులపై కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని ఆమె తెలిపారు. మొత్తం ప్రపంచమంతా సర్జికల్ దాడులు జరిగినట్లు అంగీకరిస్తుంటే కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు మాత్రం ఈ దాడులు జరగటం పట్ల అనుమానాలు వ్యక్తం చేయటం బాధ కలిగించిందన్నారు. సర్జికల్ దాడులు చేశామని సైన్యం చెబుతుంటే విశ్వసించకుండా అనుమానాలు వ్యక్తం చేయటం అమానుషమని బహుగుణ స్పష్టం చేశారు. సర్జికల్ దాడుల సాక్ష్యాలు చూపించాలనటం సిగ్గు చేటన్నారు.
సర్జికల్ దాడులపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేయటంతోపాటు సాక్ష్యాలు డిమాండ్ చేయం ద్వారా దేశం ప్రతిష్టను దెబ్బ తీసిందని ఆమె దుయ్యబట్టారు. సర్జికల్ దాడులకు నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆమె ప్రశంసలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో మాఫియా రాజ్యమేలుతోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, శాంతిభద్రతలు లేవు, కాంగ్రెస్, సమాజ్‌వాది నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించవలసి ఉన్నదని ఆమె సూచించారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ నిర్వీర్యమైపోయిందన్నారు.