జాతీయ వార్తలు

మొబైల్ ఫోన్లు తీసుకురావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: మంత్రివర్గ సమావేశాలలోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా కేంద్రం నిషేధం విధించింది. మంత్రివర్గ సమావేశాలలో జరిగే చర్చలను ఎవరైనా అనధికారికంగా మొబైల్ ఫోన్ల వంటి సమాచార పరికరాలతో రికార్డు చేసి, లీక్ చేస్తారనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ నిషేధం విధించింది. ఈ విషయాన్ని సంబంధిత మంత్రులందరికీ తెలియజేయాలని వారి ప్రైవేటు కార్యదర్శులను క్యాబినెట్ సెక్రటేరియట్ ఇటీవల ఆదేశించింది. ‘క్యాబినెట్/ క్యాబినెట్ కమిటీల సమావేశాలు జరిగే ప్రదేశంలోకి ఇకనుంచి స్మార్ట్ఫోన్లు/ మొబైల్ ఫోన్లను అనుమతించకూడదని నిర్ణయించడం జరిగింది’ అని క్యాబినెట్ సెక్రటేరియట్ తన ఆదేశాలలో పేర్కొంది. మంత్రులెవరూ మంత్రివర్గ సమావేశాలకు వచ్చేప్పుడు మొబైల్ ఫోన్లను తీసుకు రావద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశించటం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు మంత్రులు తమ వెంట ఫోన్లను తీసుకెళ్లేవారు. అయితే వాటిని సైలెన్స్ మోడ్‌లో పెట్టడమో, ఆఫ్ చేయడమో చేసేవారు. అయితే మొబైల్ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ మొబైల్ ఫోన్ల భద్రతపై భద్రతా సంస్థలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్యాబినెట్ సమావేశాలలో సున్నితమైన అంశాలపై చర్చ జరుగుతుంది కాబట్టి, ఆ చర్చలను రహస్యంగా ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ కానీయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.