జాతీయ వార్తలు

రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిన ప్రత్యూష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టివి నటి ‘బాలిక వధు’ ప్రత్యూష బెనర్జీ గత రెండు నెలల్లో రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఆమె ఆప్తమిత్రురాలు, టివి నటి సరాఖాన్ తెలిపిందని ఒక వార్తా సంస్థ వెల్లడించింది. ప్రత్యూష ఆత్మహత్య తర్వాత ఆమె గురించిన వివరాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మిత్రులు, బంధువులు ఆమె వ్యక్తిగత జీవిత విషయాలను బయటపెడుతున్నారు. ‘నుదుట సింధూరం ధరించినప్పటికీ, మనం ఎప్పుడు పెళ్లిచేసుకుందాం’ అని రాహుల్‌ను ప్రత్యూష అడుగుతుండేదని, అలాగే ప్రత్యూషకు సంబంధించిన గత ‘వ్యవహారాల’ గురించి రాహుల్ అడుగుతూ ఉండేవాడని తెలిపింది.
ఈ విషయంలో ప్రత్యూష చాలా ఆందోళనకు గురయ్యేదని పేర్కొంది. ఇలావుండగా రాహుల్ మాజీ ప్రేయసి సలోని ఇటీవల వారి ఇంటికి వచ్చినట్లు కూడా తెలిపింది.