అంతర్జాతీయం

పాక్ ధోరణి ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనామా, అక్టోబర్ 24: పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం అని భారత్ బహ్రెయిన్‌కు స్పష్టం చేసింది. జమ్ము కాశ్మీర్‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి, సరిహద్దుకు ఆవలనుంచి ఉగ్రవాదులను ప్రేరేపించటమేనని భారత హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బహ్రయిన్ దేశ వ్యవహారాల శాఖ మంత్రి రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాకు వివరించారు. గల్ఫ్ దేశాల్లో ఒకటైన బహ్రయిన్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన రాజ్‌నాథ్ సోమవారం ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్‌లో కీలక సభ్యదేశమైన బహ్రయిన్‌కు పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం గురించి అవగాహన కల్పించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇస్లామిక్ కాన్ఫరెన్స్‌లో పాక్‌కూడా సభ్యదేశం కావటం గమనార్హం. కాశ్మీర్‌లో నాలుగు నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని వీరుడిగా, యోధుడిగా పాకిస్తాన్ ప్రశంసించడంతోనే ఆ దేశం అధికారికంగానే ఉగ్రవాదులకు ఎంత స్వేచ్ఛనిస్తుందో అర్థమవుతోందని రాజ్‌నాథ్ ఖలీఫాతో చెప్పారు. గత జూలైలో పాకిస్తాన్ ఉగ్రవాది బహదూర్ అలీని అరెస్టు చేసిన విషయాన్నీ ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ వైఖరిలో ఎలాంటి మార్పు రానంతకాలం ఉగ్రవాదంపై పాక్ హామీలను నమ్మలేమని కూడా ఆయన అన్నారు. జమ్ము కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇందులో ఎవరి జోక్యాన్నీ అంగీకరించేది లేదని ఆయన పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజల సుస్థిర అభివృద్ధి విషయంలో భారత్‌లో రాజకీయంగా ఏకాభిప్రాయం ఉందని ఆయన వివరించారు.