జాతీయ వార్తలు

‘మేక్ ఇన్ అసోం’ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోల్‌పార, ఏప్రిల్ 4: అసోంలో రెండు, ఆఖరి విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటర్లపై వరాలు కురిపించారు. రాష్ట్రంలో ‘మేక్ ఇన్ అసోం’ కింద పది లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని సోమవారం ఆయన ప్రకటించారు. ‘అభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్... పేదల ఉద్ధరణకు ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారు. మేక్ ఇన్ అస్సాం కింద యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తాం’ అని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో సోమవారం తొలివిడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. యువత సంక్షేమానికి తాము పాటుపడతామని గత 15 ఏళ్ల పాలనలో వారికోసం కాంగ్రెస్ ఎన్నో పథకాలు అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పరిస్థితులను ఓసారి గుర్తుచేసుకోండి. 2001కి ముందు అస్సాం హింస, హత్యలతో అట్టుడికిపోయేది. అభివృద్ధి అనేది అందని ద్రాక్షాలా ఉండేది’ అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వంతో ఉంటున్నారని, ఎంతో అభివృద్ధి చెందడంతో స్థానికులు సుఖశాంతులతో జీవిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తెలిపారు. ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్న రాహుల్ 24వేల కిలోమీటర్లకు పైగానే రహదారులు నిర్మించిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. మూడు కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు తిరిగి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడంతోపాటు ప్రజల జీవితాలను బాగుచేస్తుందని రాహుల్ భరోసా ఇచ్చారు. సంవత్సర ఆదాయం 2.5 లక్షలకంటే తక్కువ ఉన్న ప్రజలు ఉచిత వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి గొగోయ్‌కు సూచించినట్టు ఆయన వెల్లడించారు. సమాజంలో వైష్యమ్యాలు రెచ్చగొట్టి ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు జొప్పించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని రాహుల్ తీవ్ర ఆరోపణ చేశారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రకటించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సంపన్నులు, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.