రాష్ట్రీయం

తలాక్ తప్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహోబా (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 24: మూడుసార్లు ‘తలాక్’ చెప్పి విడాకులు పుచ్చుకునే పద్ధతి (ట్రిపుల్ తలాక్)పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వౌనాన్ని వీడారు. ముస్లిం మతంలో కొనసాగుతున్న ఈ దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన సోమవారం స్పష్టం చేశారు. అలాగే హిందూ సమాజంలో గర్భస్థ ఆడ శిశువుల హత్యలు (భ్రూణ హత్యలు) విచ్చలవిడిగా కొనసాగుతుండటాన్ని ప్రధాని నిర్ద్వంద్వంగా ఖండించారు. ‘భ్రూణ హత్య మహా పాతకం. ఈ పాపానికి ఒడిగడుతున్నది హిందువులే కావచ్చు. అయినప్పటికీ ఈ దురాగతానికి అడ్డుకట్ట వేసేందుకు మా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. మతం గురించి ఎవరూ పట్టించుకోకూడదు. మన కుమార్తెలు, తల్లులు, సోదరీమణులను రక్షించడమే కాదు.. వారిని ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాలి. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు ఉద్ఘాటించాం. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ సమస్య ముందుకొచ్చింది. భ్రూణ హత్యలకు పాల్పడిన హిందువులను జైలుకు పంపుతున్నట్లుగానే, ఫోన్ ద్వారా తలాక్ చెప్పి ముస్లిం సోదరీమణుల జీవితాలను ఛిద్రం చేస్తున్న
వారిని కూడా జైలుకు పంపి తీరాలి’ అని సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో నిర్వహించిన ‘మహా పరివర్తన్ ర్యాలీ’లో మోదీ తేల్చి చెప్పారు. మహిళలపై ఎటువంటి అకృత్యాలు జరగరాదని, మతాన్ని ఆధారంగా చేసుకుని ఎవరి పట్లా వివక్ష చూపరాదని తమ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, ట్రిపుల్ తలాక్‌కు రాజకీయ రంగు పులమొద్దని, దీనిని హిందువులకు, ముస్లింలకు మధ్య పోరాటంగానో లేక బిజెపికి, ఇతర పార్టీలకు మధ్య జగడంగానో మార్చవద్దని వార్తా పత్రికలకు, చానళ్లకు విజ్ఞప్తి చేశారు.

చిత్రం.. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో నిర్వహించిన బిజెపి సమావేశంలో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ