జాతీయ వార్తలు

మతం పేరుతో ఓట్లడగటం అవినీతేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఎన్నికల అవినితీ చట్టం పరిధి, విస్తృతిపై సుప్రీం కోర్టు తన తీర్పును గురువారం రిజర్వ్ చేసింది. మతం, జాతి, కులం, సమాజం, భాషల పేరుతో ఓట్లు అడగటం అవినీతి పరిధిలోకి వస్తుందా రాదా అన్న అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘మతం పేరుతో ఓట్లు అడగటం అంటే ఏమిటి? ఎవరి మతం? అభ్యర్థుల మతమా? లేక ఓట్ల ఏజెంట్ మతమా లేక మూడో పార్టీదా? (ఓట్లు అడుగుతున్న వారు) రాజ్యాంగంలోని 123(3) ప్రజాప్రాతినిధ్య చట్టంలో ‘‘అతని మతం’’ అన్న పదానికి అభ్యర్థుల విశ్వాసం అనే పేర్కొంది. అలాంటప్పుడు ఎన్నికల అవినీతి చట్టం పరిధి ఏ మేరకు ఉంటుంది అన్నది తేలాల్సి ఉంది’’ అని పేర్కొంది. అదే సమయంలో హిందుత్వం అంటే జీవనమార్గం అన్న తమ తీర్పును పున:సమీక్షించేది లేదని మరోసారి ధర్మాసనం స్పష్టం చేసింది. హిందుత్వ తీర్పును మళ్లీ విచారిస్తే తాను దానిపై వాదనలు వినిపిస్తానని సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్ అన్నప్పుడు, ‘‘ఈ విచారణలో హిందుత్వ తీర్పును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? దాన్ని సమీక్షించటం లేదని స్పష్టం చేశాం’’ అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. మతాన్ని రాజకీయాలనుంచి వేరు చేయాలన్న కేసుపై జరుగుతున్న విచారణలో తామూ భాగస్వామ్యం అవుతామని సామాజిక కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, షాంసుల్ ఇస్లామ్ దిలిప్ మండల్ అభ్యర్థించారు. ఈ కేసులో అన్ని పార్టీలు ప్రఖ్యాత న్యాయవాదుల చేత తమ వాదనలను వినిపించాయి. అరివంద్ దతార్, శ్యామ్ దివాన్, కపిల్‌సిబల్, సల్మాన్ ఖుర్షీద్, ఇందిరా జైసింగ్ వంటివారు ఆరు రోజులుగా తమ వాదనలను వినిపించారు.