జాతీయ వార్తలు

కేంద్ర పెన్షనర్లకు కొత్త గుర్తింపు కార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశ వ్యాప్తంగా పెన్షనర్లు అందరికీ జాతీయ చిహ్నం (మూడు సింహాల గుర్తు)తో గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు హోమ్‌శాఖ ఆమోదం తెలిపింది. పెన్షనర్లందరికీ జాతీయ చిహ్నంతో ఒకే విధమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. ఈ అంశాన్ని ఇటీవలే క్షుణ్ణంగా చర్చించి జాతీయ చిహ్నంతో పెన్షనర్లకు గుర్తింపు కార్డులు జారీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల జారీలో అన్ని మంత్రిత్వశాఖలూ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖ ఆదేశించింది. స్వయం ప్రతిపత్తిగల సంస్థల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగుల విషయంలో ఇది వర్తించదని పేర్కొన్నారు. అలాంటి సంస్థలు గుర్తింపు కార్డులు జారీచేసే సమయంలో సొంత లోగోలు వాడుకోవచ్చని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు.