జాతీయ వార్తలు

మీరే మా బాస్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, అక్టోబర్ 27: దేశంలో పేరున్న వజ్రాల వ్యాపారి సావ్‌జీభాయ్ ధోలాకియా. హరే కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ యజమాని ధోలాకియాకు వజ్రాల వ్యాపారం, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఉన్నాయి. ఏటా సంస్థ లాభాల్లో ఉద్యోగులకు బోనస్ రూపేణా గిఫ్టులు అందజేసే ధోలాకియా ఈ దీపావళి సందర్భంగా భారీ నజరానా ప్రకటించారు. 400 మంది ఉద్యోగులకు ఫ్లాట్లు, 1260 మందికి కార్లు అందజేయనున్నారు. అంతేకాకుండా 56 మంది ఉద్యోగులు జువెల్లరీ బాక్సులు తీసుకోనున్నారు. సూరత్‌కు చెందిన బిలీనియర్ ధోలాకియా కంపెనీలో నెలకు పది వేల నుంచి అరవై వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగులున్నారు. 2011 నుంచి ఆయన తన వద్ద పనిచేసే ఉద్యోగులకు విలువైన గిఫ్టులు ఇవ్వడం మొదలెట్టారు. ధోలాకియా ఎంతో కష్టపడి ఈ స్థాయి చేరుకున్నారు. అమ్రేలీ జిల్లా డుధాల గ్రామానికి చెందిన ఆయన 1977లో సూరత్‌కి ఆర్‌టిసి బస్సులో వచ్చేవారు. పనె్నండు రూపాయల బస్టు టికెట్‌పై ప్రయాణించే ధోలాకియా ప్రస్తుతం వజ్రాల వ్యాపారం, వస్త్ర వ్యాపారంలో మహారాజులా వెలుగొందుతున్నారు.