జాతీయ వార్తలు

ప్రాంతీయ భద్రత, సుస్థిరత సాధనకు కలసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: తమ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో భద్రత, సుస్థిరత, సుఖసంతోషాలను పెంపొందించడంలో భారత్, న్యూజిలాండ్ కలిసి పని చేయగలవని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మన దేశంలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీకి రాష్టప్రతి భవన్ వద్ద స్వాగతం పలుకుతూ రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేశారు. కీ బుధవారం రాష్టప్రతిని కలిశారు. న్యూజిలాండ్‌తో తన సంబంధాలకు భారత్ ఎంతో విలువ ఇస్తోందని, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న అత్యున్నత స్థాయి సంబంధాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంతగా బలపడుతున్నాయో చెప్పడానికి నిదర్శనమని న్యూజిలాండ్ ప్రధానికి, ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ రాష్టప్రతి అన్నారు. భిన్న సంస్కృతులు కలిగిన, చైతన్య పూరితమైన ప్రజాస్వామిక దేశాలకు రెండు దేశాల మధ్య ఒక ప్రత్యేక బంధం ఉందని ఆయన అన్నారు. ‘ఆహార భద్రత సాధించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో న్యూజిలాండ్ భాగస్వామి కాగలదు. గత ఎనిమిదేళ్లలో రెండు దేశాల మధ్య సరకులు, సేవల్లో ద్వైపాక్షిక వ్యాపారం రెట్టింపయింది. ప్రస్తుతం 2015లో రెండు దేశాల మధ్య సరకులు, సేవల వ్యాపారం మొత్తం వ్యాపారం 145 కోట్ల డాలర్లకు చేరుకుంది’ అని రాష్టప్రతి చెప్పారు. భారత న్యూజిలాండ్ దేశాలు తమ ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో సైతం భద్రత, సుస్థిరత, సుఖసంతోషాలను పెంపొందించడంలో భాగస్వాములు కాగలవని, సముద్ర జలాల రక్షణ, నౌకాయానం స్వేచ్ఛను కాపాడడం, ఉగ్రవాద నిరోధంలాంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పని చేయవచ్చని ఆయన అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపర్చుకోవాలన్న ఆకాంక్ష ఇరుదేశాల ప్రజల్లోను బలంగా ఉందని కూడా ఆయన చెప్పినట్లు రాష్టప్రతి ప్రతినిధి తెలిపారు. ప్రణబ్ మనోభావాలతో ఏకీభవించిన కీ, ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పెరగాలని తన ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించినందుకు ఆయన రాష్టప్రతికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారత దేశ ఆర్థికాభివృద్ధి ఎన్నో అవకాశాలను కల్పించిందన్నారు. న్యూజిలాండ్‌లో భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని కూడా ఆయన చెప్పారు.

భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ గురువారం ఢిల్లీలోని జామా మసీదును సందర్శించినప్పటి చిత్రం