జాతీయ వార్తలు

‘కూటమి’కి అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఉత్తరప్రదేశ్‌లో ‘మహా కూటమి’ ఏర్పాటయ్యే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ గురువారం స్పష్టం చేసింది. 27 ఏళ్లుగా కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుకుంటున్నారని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. ‘రాహుల్ గాంధీ యాత్ర అధికార దాహంతోకాక.. రాజకీయాలకు కొత్త రూపం తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టింది’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చెప్పారు. రకరకాల విచ్ఛిన్న రాజకీయాల ద్వారా అభివృద్ధి అంశంనుంచి జనం దృష్టిని మళ్లించడానికి సమాజ్‌వాది పార్టీ, బిఎస్పీ, బిజెపి సమాన బాధ్యులని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం రాహుల్ గాంధీతో సమావేశమై, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లౌకిక శక్తులతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలించాలని కోరిన నేపథ్యంలో సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జెడి (యు) నాయకుడు శరద్ యాదవ్ రెండు రోజుల క్రితం రాహుల్‌తో, ఈ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్‌తో సమావేశం కావడం ఈ మహాకూటమికి సంకేతాలన్న ఊహాగానాలను కూడా సుర్జేవాలా తోసిపుచ్చారు. భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోను పొత్తుపెట్టుకోదా? అని విలేఖరులు గుచ్చిగుచ్చి ప్రశ్నించగా, ఆరునెలల కాలంలో ఏం జరుగుతుందో తాను ఎలా చెప్పగలనని ఆయన ఎదురు ప్రశ్నించారు.