జాతీయ వార్తలు

48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: భారత్‌లో గూఢచర్య నెట్‌వర్క్ నడుపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన పాకిస్తాన్ దౌత్త్ధారి మహమూద్ అఖ్తర్‌ను 48 గంటలలోగా దేశం విడిచి వెళ్లిపోవలసిందిగా భారత్ గురువారం ఆదేశించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న అఖ్తర్‌ను గూఢచర్య రాకెట్ నడుపుతున్న ఆరోపణలపై గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 48 గంటలలోగా తన కుటుంబంతో సహా తిరిగి పాకిస్తాన్‌కు వెళ్లిపోవలసిందిగా అఖ్తర్‌ను ఆదేశించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఇక్కడ మీడియాకు చెప్పారు. పాకిస్తాన్ హైకమిషన్‌లోని ఉద్యోగి అయిన అఖ్తర్‌ను, మరో ఇద్దరు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ గూఢచారులను ఢిల్లీ జంతు ప్రదర్శన శాల బయట పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గూఢచర్యంలో అఖ్తర్‌కు సహకరించిన ఈ ఇద్దరు గూఢచారులను 12 రోజుల పాటు పోలీస్ రిమాండ్‌కు అప్పగిస్తూ ఢిల్లీలోని ఓ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరు రాజస్థాన్‌కు చెందినవారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత అఖ్తర్‌పై చేయిచేసుకున్నట్లు పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. గూఢచార రాకెట్‌లో మరెవరైనా ఉన్నట్టు ఆధారాలు లభిస్తే వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని వికాస్ స్వరూప్ తెలిపారు. గూఢచర్యానికి పాల్పడుతున్న పాకిస్తాన్ హైకమిషన్‌లోని ఉద్యోగి అఖ్తర్ అనంగీకృతుడని భారత్ గురువారం ప్రకటించింది.

చిత్రం.. పోలీసుల అదుపులో అఖ్తర్‌కు
సహకరించిన ఇద్దరు పాక్ గూఢచారులు