జాతీయ వార్తలు

ఆర్‌కె నగర్ నుంచే జయ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 4: తమిళనాడులో తన రాజకీయ ప్రత్యర్థి డిఎంకెను ఈ ఎన్నికల్లోనూ మట్టికరిపించడానికి అన్నాడిఎంకె పావులు కదుపుతోంది. పలు సంస్థల సర్వేల పలితాలూ అనుకూలంగా రావడంతో అన్నాడిఎంకె ఉత్సాహంతో ముందుకెళుతోంది. మే 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 227 మంది అభ్యర్థులతో జాబితాను ముఖ్యమంత్రి జయలలిత సోమవారం వెల్లడించారు. జయలలిత ఆర్‌కె నగర్ నియోజకవర్గం నుంచే ఈసారీ పోటీ చేయనున్నారు. మిత్రపక్షాలకు ఏడు సీట్లు కేటాయించిన అన్నాడిఎంకె 227 మందితో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రెండు వారాలుగా పేర్లను వడపోతపోసిన జయలలిత మళ్లీ ప్రభుత్వం తమదేనన్న ధీమాతో ఉన్నారు. ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రి నాథమ్ ఆర్ విశ్వనాథం, గృహనిర్మాణ మంత్రి ఆర్ వైతిలింగం, హేండ్లూం మంత్రి గోకుల ఇందిరా, సాంఘిక సంక్షేమ మంత్రి బి వలర్మతి సహా పలువులు మంత్రులు మళ్లీ పోటీ చేస్తున్నారు.