జాతీయ వార్తలు

మళ్లీ భారత్-చైనా నువ్వా.. నేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లే/న్యూఢిల్లీ, నవంబర్ 3: వాస్తవాధీన రేఖ ప్రాంతంలోని డెమ్‌చోక్ వద్ద గత 36 గంటల నుంచి భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన చైనా సైనికుల్ని భారత జవాన్లు అంగుళం కూడా ముందుకు రాకుండా నిరోధించగలిగారు. ఎమ్‌ఎన్‌ఆర్‌జిఎ పథకం కింద భారత సైనిక ఇంజనీర్లు ఈ ప్రాంతంలో చేపడుతున్న పనులకు చైనా సైనికులు అభ్యంతరం చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లే ప్రాంతానికి తూర్పుగా 250 కి.మీ. దూరంలో ఉన్న డెమ్‌చోక్ గ్రామస్థులకు నీటి పారుదల కాలువను భారత ఇంజనీర్లు నిర్మిస్తున్నారు. ఈ కాలువను ‘హాట్ స్ప్రింగ్’ జలాలకు అనుసంధానించతో చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. గురువారం ఈ ప్రాంతానికి చేరుకున్న చైనా సైనికులు భారత నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే ఈ కాలువ నిర్మాణం జరుగుతోందని భారత సైనికులు తేల్చిచెప్పారు. ఈ ప్రాంతం తమ ఆధీనంలోనిదంటూ చైనా సైనికులు ముందుకురావడంతో భారత సైనికులు గట్టిగానే అడ్డుకున్నారు.