జాతీయ వార్తలు

హైకోర్టు జడ్జీల సంఖ్యను 906 నుంచి 1,079కి పెంచాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: న్యాయ నియామకాల్లో జాప్యంపై సుప్రీం కోర్టు నుంచి విమర్శలు ఎదురవడంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను 906 నుంచి 1,079కి పెంచామని, హైకోర్టుల్లోని ఖాళీలు తమ హయాంలో అసాధారణంగా ఏమీ పెరగలేదని ఎన్‌డిఎ సర్కారు స్పష్టం చేసింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి) విచారణ కారణంగా గత సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో కొత్త నియామకాలేమీ జరపకపోయినప్పటికీ గత రెండేళ్ల కాలంలో హైకోర్టుల్లో న్యాయ నియామకాల వార్షిక సగటు ఏమాత్రం తగ్గలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. న్యాయ వ్యవస్థపట్ల, దాని స్వేచ్ఛపట్ల కేంద్ర ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ ఎన్‌డిఎ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో ఆ అధికారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంపట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, అందుకే ఖాళీ పదవులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటూ, 2014 జూన్ నాటికి 906 మందిగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఈ ఏడాది జూన్ నాటికి 1,079 మందికి పెంచిన విషయాన్ని గుర్తుచేశాయి. హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయన్నది కేవలం మీడియా చేస్తున్న అసత్య ప్రచారమేనని, గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే హైకోర్టుల్లో ఖాళీలు అసాధారణంగా ఏమీ పెరగలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.