జాతీయ వార్తలు

దీపావళి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దీపావళి సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధానులు, నగరాల్లోని చారిత్రాత్మక కట్టడాలలు, పర్యాటక ప్రాంతాలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయ. ముంబయిలో మహిళలు సంప్రదాయ వాయిద్యాల సంగీతంతో ప్రదర్శనలు నిర్వహించారు. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లోనూ పండుగ వాతావరణం కనిపించింది. రాజధాని ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద సంగీత కళాకారులు కచ్చేరీ నిర్వహించారు. సరిహద్దుల్లో జవానులకు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు దేశమంతా ఏకత్రితమై పండుగ శుభాకాంక్షలు తెలిపింది. సరిహద్దుల్లో జవానులకు మిఠాయిలు పంపించారు. బాలీవుడ్, టాలీవుడ్ రీల్ లైఫ్ నుంచి బయటకు వచ్చి రియల్ లైఫ్ దీపావళి జరుపుకుంటున్నారు.
బాలీవుడ్ బిజీబిజీ
ముంబయి: బాలీవుడ్ యావత్తూ దీపావళి పండుగ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉంది. బాలీవుట్ నటులు తమ ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరించుకున్నారు. జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసంలో దివ్వెల పండుగకోసం ముస్తాబైంది. షారూక్‌ఖాన్ విదేశాల్లో షూటింగ్ వాయిదా వేసుకుని ముంబయికి చేరుకున్నారు. అలాగే మనాలీలో ‘ట్యూబ్‌లైట్’ షూటింగ్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్ కూడా పండుగకోసం నగరానికి రానున్నాడు. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న అనుష్కశర్మ దీపావళి తమకెంతో ప్రత్యేకమైందని పేర్కొంది. కాలుష్యానికి ఆస్కారం లేకుండా ప్రజలందరూ దీపావళి చేసుకోవాలని మరో తార విద్యాబాలన్ కోరారు. ఉదయమే నిద్రలేచి కొత్త బట్టలు వేసుకుని గుడికెళ్లడం, స్నేహితులతో సరదాగా గడిపి బాణసంచా కాల్చడం చిన్నప్పటి నుంచీ తనకు అలవాటని ఆమె గుర్తుచేసుకున్నారు. ‘సొంతూరు బెంగళూరు వెళ్లి తల్లిదండ్రులు, సోదరితో కలసి దీపావళి చేసుకుంటా’ అని మరోనటి దీపికా పదుకొనె చెప్పింది. ఇటీవల విడుదలైన ‘దంగల్’ ట్రయలర్‌కు మంచి టాక్ రావడంతో హీరో అమీర్‌ఖాన్ దాన్ని ఆస్వాదిస్తూ దీపావళి సందడి చేయనున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య గడుపుతారని ఆయన అభిమానులు తెలిపారు. బంద్రాలోని తన నివాసంలో స్నేహితులకు, ఆప్తులకు పార్టీ ఏర్పాటు చేశాడు.
భక్తులతో ఆలయాలు కిటకిట
చెన్నై: తమిళనాట ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శనివారం ఉదయమే కొత్త వస్త్రాలు ధరించిన భక్తులు ఆలయాల్లో గడిపారు. ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి తమ జీవితాల్లో కొత్త కాంతులు ప్రసరింపచేయాలని ఆకాంక్షించారు. స్నేహితులు, బంధువులను కలిసి మిఠాయిలు పంచిపెట్టారు. సాధారణంగా పండుగ రోజు అంటే కొత్త సినిమాల విడుదలకు ఓ ప్రత్యేక ఉంటుంది. అయితే ఈ దీపావళికి కేవలం రెండు చిత్రాలే విడుదలయ్యాయి. ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన ‘కోడి’, కార్తీ హీరోగా ‘కాష్మోరా’ విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య ఈ రెండూ అభిమానుల మందుకు వచ్చాయి. అలాగే ‘కడలై’, ‘తిరైక్కు వార్తా కథై’ రాష్టవ్య్రాప్తంగా విడుదలయ్యాయి. దాదాపు అన్ని తమిళ టివి చానళ్లు ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.

చిత్రం.. దీపావళి, కాళిపూజ సందర్భంగా శనివారం కోల్‌కతాలోని కాళీ ఆలయం వద్ద దర్శనంకోసం బారులు తీరిన భక్తులు